The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మీరే అభినందిస్తారు అంటున్న డైరెక్టర్స్

The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2′ ..ప్రస్తుతం వివాదాల నడుమ నలుగుతోంది.’ది ఫ్యామిలీ మ్యాన్ 1’ కి సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెరకెక్కించారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. మొదటి భాగంలో నటించిన మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు ప్రియమణి, సమంత అక్కినేని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమంత సీక్వెల్ లో నటించడంతో భారీగా అంచనాలు పెరిగాయి. గత ఏడాది నుంచి దీని గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూసిన వాళ్ళు ఇటీవల ట్రైలర్ రిలీజయ్యాక నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

directors says that the-family-man-2..will be appreciated by everyone
directors says that the-family-man-2..will be appreciated by everyone

ఒకరకంగా చెప్పాలంటే ఓ భారీ బడ్జెట్ సినిమాకి ఏ విధంగా వివాదాలు చుట్టు ముట్టాయో అలా దీనికి చుట్టుకున్నాయి.. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అనుకున్న తేదీన స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ట్రైలర్ చూశాక శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన LTTE కి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు చూపించారని వివాదాలు చెలరేగాయి. తమిళ నటి అయి సమంత ఈ పాత్రలో నటించడం ఏంటని సోషల్ మీడియా విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే.

The family man 2 : విమర్శలు ఎదుర్కొంటున్న సమంత ఇప్పటి వరకు స్పందించలేదు.

అయితే రాజీ పాత్రలో నటించి విమర్శలు ఎదుర్కొంటున్న సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ దర్శకులు మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం రెండు షాట్స్ చూసి ఇలా డిసైడవడం కరెక్ట్ కాదని జూన్ 4న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చూశాక మీకే అన్ని సందేహాలకు సమాధానం దొరుకుందని తెలిపారు. చూడాలి మరి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ రిలీజయ్యాక ఎలాంటి వివాదాలను ఎదుర్కొంటుందో. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది.