Director Venu Yeldandi Second Movie Update : ‘బలగం’ వేణు రెండో సినిమా హీరో అతడేనా?

NQ Staff - July 29, 2023 / 08:08 PM IST

Director Venu Yeldandi Second Movie Update : ‘బలగం’ వేణు రెండో సినిమా హీరో అతడేనా?

Director Venu Yeldandi Second Movie Update :

బలగం వంటి చిన్న చిత్రం తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు జబర్దస్త్ వేణు. సుదీర్ఘ కాలంగా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ వస్తున్న వేణు లో మంచి దర్శకుడు ఉన్నాడని గుర్తించిన దిల్ రాజు బలగం సినిమాతో భారీగా లాభాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అందుకే వేణు తో మరో సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ఒప్పందం గుర్తుంచుకున్నాడట. కొన్ని వారాల క్రితం వేణు తన తదుపరి ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

బలగం హీరోతో మరోసారి..

మొదటి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండవ సినిమా భారీగా చేయాలి.. కొత్తగా ఏదో చేయాలి అని కాకుండా సింపుల్ గానే ఉండాలి బలగం మాదిరిగా అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో వేణు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Director Venu Yeldandi Second Movie Update

Director Venu Yeldandi Second Movie Update

బలగం సినిమాలో నటించిన హీరో ప్రియదర్శి నే వేణు రెండో సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు నుండి లైన్ క్లియర్ అయింది. అతి త్వరలోనే సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే దర్శకుడు వేణు మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us