Director Vamsi Paidipally : టీవీ సీరియల్స్ పవర్ మీకు తెలియదు.. నెగెటివ్ రివ్యూల మీద ఫైర్ అయిన వంశీ..!
NQ Staff - January 17, 2023 / 07:44 PM IST

Director Vamsi Paidipally : ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో తమిళ స్టార్ హీరో దళపతి నటించిన వారీసు మూవీ కూడా ఉంది. ఈ సినిమాను తమిళంలో జనవరి 11న రిలీజ్ చేస్తే.. తెలుగులో మాత్రం జనవరి 14న రిలీజ్ చేశారు. తెలుగులో దీన్ని వారసుడుగా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. కానీ కొందరు మాత్రం దీనిపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మూవీ చూడటానికి టీవీ సీరియల్ లాగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ నెగెటివ్ రివ్యూల మీద తాజా ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఒక సినిమాను సీరియల్ లా ఉందని ఎలా అంటారు. అసలు సినిమా తీయడానికి తెర వెనక పడే కష్టం మీకు తెలుసా.
నిర్మాత త్యాగాలు…
ఒక మూవీ టీమ్ ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వారు పడే శ్రమ మీకు అర్థం కాదు. ప్రతి సినిమా వెనక ఓ నిర్మాత ఎన్నో త్యాగాలు చేస్తుంటాడు. అయినా సీరియల్స్ తో పోలుస్తూ వాటి విలువను ఎందుకు తగ్గిస్తున్నారు. సీరియల్స్ కు ఉన్న పవర్ మీకు తెలియదు.
కావాలంటే సాయంత్రం ఇంటికి వెళ్లి మీ ఇళ్లలో చూడండి. ఎంత మంది టీవీ సీరియల్స్ చూస్తున్నారో మీకు అర్థం అవుతుంది. కాబట్టి దేన్ని కించపరచొద్దు. ఎవరినైనా తక్కువ చేయాలని చూశారో.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారని అర్థం చేసుకోండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చాడు డైరెక్టర్ వంశీ.