Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన త్రివిక్ర‌మ్

Bheemla Nayak : వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా మీద అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి . మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాని తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర దగ్గుబాటి రానా పోషిస్తూ ఉండగా అక్కడ బిజు మీనన్ పోషించిన పాత్ర ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు.

director trivikram srinivas interesting comments on Bheemla Nayak
director trivikram srinivas interesting comments on Bheemla Nayak

ఈ సినిమాలో దగ్గుబాటి రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంటే పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు.. రఘుబాబు, బ్రహ్మాజీ, రవీంద్ర విజయ్, వండర్ ఉమెన్ లిరీషా వంటి వారు నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీ 2022 వ సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ కథ, కథనం మాటలు అందిస్తున్నారు.. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు.

director trivikram srinivas interesting comments on Bheemla Nayak
director trivikram srinivas interesting comments on Bheemla Nayak

ఆర్ఆర్ఆర్ వ‌ల‌న పవన్ సినిమా కూడా బరిలో నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో తమ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే జనవరి 12వ తేదీనే వస్తుందని ఇటీవ‌ల‌ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే ‘భీమ్లా నాయక్’ విడుదలను కాస్త వెనక్కి జరపడానికి కొంతమంది పెద్దలు రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఈవెంట్‌కి హాజ‌రైన త్రివిక్ర‌మ్.. భీమ్లా నాయ‌క్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా పోస్ట్ ప్రొఢ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని అన్నాడు.సినిమా బాగా వచ్చింద‌ని చెప్పాడు. సంక్రాంతి బ‌రిలో ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం.