Sri Reddy : శ్రీరెడ్డికి మరోసారి అన్యాయం చేస్తున్న డైరెక్టర్ తేజ.. అసలేం జరిగిందంటే..?
NQ Staff - June 10, 2023 / 10:57 AM IST

Sri Reddy : సౌత్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ బ్యూటీ అంటే అందరికీ టక్కున శ్రీరెడ్డి పేరే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆమె అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగు నటీమణులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ఆ సమయంలో శ్రీరెడ్డికి సపోర్టు చేసిన వారిలో దర్శకుడు తేజ కూడా ఒకరు.
ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని మీడియా ముఖంగా ప్రకటించాడు తేజ. కానీ అప్పటి నుంచి ఆయన ఇచ్చిన మాట మీద మాత్రం నిలబడట్లేదు. శ్రీరెడ్డికి ఇప్పటి వరకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు తేజ. వీలు కుదిరినప్పుడల్లా శ్రీరెడ్డి కూడా అడుగుతూనే ఉంది. ఇక తాజాగా తేజకు మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది.
నేను ఇచ్చిన మాట నాకు గుర్తుంది. కచ్చితంగా శ్రీరెడ్డికి నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను అంటూ తెలిపాడు తేజ. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం ఇప్పట్లో నెరవేరేలా కనిపించలేదు. ఎందుకంటే ఆయన రీసెంట్ గా తీసిన మూవీ అహింసా. ఇందులో అభిరామ్ హీరో. కాబట్టి ఇందులో ఎలాగూ తేజ ఛాన్స్ ఇవ్వలేదు.
ఇక తర్వాత సినిమా రానాతో చేయబోతున్నాడు. ఇందులో కూడా శ్రీరెడ్డికి నో ఛాన్స్. ఎందుకంటే దగ్గుబాటి ఫ్యామిలీని శ్రీరెడ్డి ఎంత తిట్టిందో అందరికీ తెలుసు. కాబట్టి శ్రీరెడ్డికి తేజ ఇప్పట్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. చూడాలి మరి తేజ ముందు ముందు అయినా శ్రీరెడ్డికి ఛాన్స్ ఇస్తాడో లేదో.