Surender Reddy : డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్.. ఐసోలేష‌న్‌లో చికిత్స‌

Surender Reddy : క‌రోనా కోర‌లు చాస్తూనే ఉంది. ఇప్ప‌టికే సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన‌ ప‌డ‌గా, తాజాగా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం అత‌ను బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబ స‌భ్యుల‌కు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో షూట్ కు అంతరాయం ఏర్పడింది.

Director Surender Reddy tested corona positive
Director Surender Reddy tested corona positive

సురేందర్ రెడ్డి మరియు అతని కుటుంబం క్వారంటైన్‌లో ఉండగా మిగిలిన చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. రెండు వారాల పాటు అఖిల్, మమ్ముట్టిలపై కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. సురేందర్ రెడ్డి పూర్తిగా కోలుకున్నాక పెండింగ్‌లో ఉన్న పార్ట్‌లను మళ్లీ చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, ఆయన కుటుంబం బాగానే ఉన్నారు.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఏజెంట్ భారీ బడ్జెట్‌తో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అఖిల్ గూఢచారి పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య కథానాయిక న‌టిస్తుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు.

పవన్‌ వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉండటంతో.. సురేందర్ రెడ్డితో సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా అనిపించడం లేదు. దీంతో ఈ గ్యాప్‌లో మరో రెండు సినిమాలు చేయాలని సురేందర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఒకటి యూత్ స్టార్ నితిన్‌తో కలిసి ఆయన ఓ సినిమా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

రామ్ తాళ్లూరి నిర్మాతగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఓ సినిమా రాబోతోంది. ఈ మేరకు ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు అప్డేట్ ఇచ్చారు. యథా కాలమ్ తథా వ్యవహారమ్ అనే పదాలను రాసి ఉన్న పోస్టర్‌ను వదిలారు. ఇందులో కూడా పవన్ కళ్యాణ్ గన్ను పట్టుకోబోతోన్నట్టు కనిపిస్తోంది.