Sriram Aditya: ద‌ర్శ‌కుడు కుమారుడి బ‌ర్త్ డే వేడుక‌.. హాజ‌రైన ప్ర‌ముఖులు

Sriram Aditya: భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా… కమర్షియల్‌గా కూడా విజయాలను దక్కించుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈయ‌న సినిమాల‌లో కొత్త ద‌నం ఉంటుంది. ఇప్పుడు మ‌హేష్‌ పెద్ద బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా సినిమా చేస్తున్నాడు.

Director Sriram Aditya Son Birthday Celebrations
Director Sriram Aditya Son Birthday Celebrations

నాని, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో దేవదాస్ సినిమా చేసిన తర్వాత ఇప్పుడు అశోక్‌ను పరిచయం చేయబోతున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఫన్ బాగానే అందించాడు . ఇప్పుడు హీరో పేరుతో సినిమా చేస్తుండ‌గా, క‌రోనా వ‌ల‌న ఈ చిత్రం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Director Sriram Aditya Son Birthday Celebrations
Director Sriram Aditya Son Birthday Celebrations

తాజాగా శ్రీరామ్ఆదిత్య‌,ప్రియాంకల మొద‌టి కుమారుడు విక్ర‌మ్ ఆదిత్య బ‌ర్త్ డే వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌గా ఈ కార్య‌క్ర‌మానికి ఆదిసాయి కుమార్, శివ నిర్వాణ‌, న‌రేష్‌, హీరో టీం అంతాహాజ‌రైంది.బ‌ర్త్ డే వేడుక‌కు సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Director Sriram Aditya Son Birthday Celebrations
Director Sriram Aditya Son Birthday Celebrations

శ్రీరామ్ తెర‌కెక్కిస్తున్న హీరో చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటో గ్రఫీ అందిస్తున్నారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Director Sriram Aditya Son Birthday Celebrations
Director Sriram Aditya Son Birthday Celebrations