Director Shankar: లైంగికంగా వేధించారంటూ శంకర్ అల్లుడిపై కేసు న‌మోదు

Director Shankar’s: లైంగికంగా వేధించారంటూ శంకర్ అల్లుడిపై కేసు న‌మోదు శంక‌ర్‌కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఒక‌వైపు సినిమాలు అనుకున్న విధంగా సాగ‌డం లేదు. ఇక ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోను ప‌లు స‌మ‌స్య‌లు ఆయ‌న్ని చుట్టు ముడుతున్నాయి. శంకర్‌ అల్లుడు, క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రోహిత్‌తో పాటు మరో అయిదుగురిని పుదుచ్చెరి పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. 16 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్‌, మిగలిన అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

త‌మిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ దామోద‌ర‌న్‌‌తో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వ‌ర్య‌ వివాహం జరిగింది. ఈ పెళ్లి మహోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

రోహిత్ దామోద‌ర‌న్‌‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో పాల్గొంటున్నారు. ఆయన తండ్రి తమిళనాడులో ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త. మధురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కు యజమాని కూడా ఆయనే. శంకర్‌ కూతురు ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇటీవ‌లే శంక‌ర్ త‌న కూతురి పెళ్లిని గ్రాండ్‌గా నిర్వ‌హించాడు.

అయితే క్రి కెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని రోహిత్‌తో పాటు ప‌లువురు లైంగికంగా వేధించార‌ని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది.రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్‌ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఇచ్చిన మ‌రో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

శంకర్‌ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్‌ చరణ్‌తో ఓ పాన్‌ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో అపరిచితుడు రీమేక్‌ కూడా చేయనున్నట్లు భోగట్టా.