AR Rahman: రెహ‌మాన్‌తో 30 ఏళ్ల త‌ర్వాత విడిపోయిన శంక‌ర్.. కార‌ణం ఏంటి..?

AR Rahman: దర్శకుడు శంకర్ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు అని అడగడం ఒక రకంగా నేరమే. ఎందుకంటే 30 ఏళ్లుగా ఆయన సినిమాలకు ఒక్కరే సంగీత దర్శకుడు ఉన్నాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాలకు మినహాయిస్తే దాదాపు అన్ని సినిమాలకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ వచ్చాడు. మొదటి నుంచి కూడా రెహమాన్ స్వరాలకు బాగా అలవాటు పడిపోయాడు శంకర్. అందుకే హీరోలు మారిన సంగీత దర్శకుడు మాత్రం ఎప్పుడూ మారలేదు.

Director Shankar Patch Up with AR Rahman
Director Shankar Patch Up with AR Rahman

అపరిచితుడు, స్నేహితుడు సినిమాల కోసం హరీష్ జైరాజ్ ను తీసుకున్నాడు శంకర్. మళ్లీ ఐ, 2.0 సినిమాలు రెహమాన్ తోనే చేశాడు. కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ కు కూడా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ తో ఆయన చేయబోయే సినిమాకు మాత్రం తమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.

రెహమాన్ కాకుండా తమన్ ఈ సినిమాలోకి రావడం వెనుక అసలు కారణం ఏంటి అంటే చాలా మంది ఆరా తీస్తున్నారు. దానికి చాలా సింపుల్ కారణం ఉంది. రామ్ చరణ్, దిల్ రాజు ఇద్దరూ ఏ ఆర్ రెహమాన్ కాకుండా తమన్ వైపు మొగ్గు చూపారు. దాంతో దర్శకుడు కూడా మరో మాట లేకుండా ఈయన వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. పైగా బాయ్స్ సినిమాలో నటుడిగా కనిపించాడు. శంకర్ తో నాటి పరిచయం అలాగే ఉంది.

అన్నింటికి మించి తమన్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. ఇవన్నీ ఈ కారణాలైతే రెహమాన్ ను కాదనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే బ్యాడ్ సెంటిమెంట్.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించిన తెలుగు సినిమాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు విజయం సాధించిన దాఖలాలు లేవు. ఏ మాయ చేసావే హిట్టయినా కూడా అది ద్విభాషా చిత్రం. అందుకే రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుడిని కాదనుకొని తమన్ వైపు అడుగులు వేశాడు శంకర్.