Director Shankar: ఒక్క ఫైట్ సీన్.. వంద మంది జూనియర్ ఆర్టిస్ట్స్.. ఖర్చు పది కోట్లపైనే..

Director Shankar: దర్శక దిగ్గజం శంకర్ సినిమాలు అంటే ఎంత భారీ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసిన గత సినిమాలు ఎంత భారీ ఖర్చుతో తెరకెక్కాయో మనం చూశాం. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు శంకర్.RC15 అనే టైటిల్ వర్కింగ్తోల తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.
ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇగతంలో శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో తమన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి శంకర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు తమన్. పోలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఓ భారీ ఫైట్ సీన్ ఉండనుందట. రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకర్ణించానున్నారట. వందమంది ఫైటర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం 10 కోట్లు కేటాయించినట్టుగా తెలుస్తుంది
ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితం రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.