Director Shankar: వెండితెర డెబ్యూ ఇవ్వ‌బోతున్న శంక‌ర్ కూతురు.. తొలి సినిమా స్టార్ హీరోతో..!

Director Shankar: భార‌త‌దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కులలో శంక‌ర్ ఒక‌రు.ఆయ‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేశారు. ఎంతోమంది హీరోల‌కు కెరీర్ బిల్డ‌ప్ చేశారు. ఆయ‌న తెర‌కెక్కించిన రోబో చిత్రం ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఆయ‌న కూతురిని వెండితెర‌కు ప‌రిచ‌యం చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Director Shankar daughter to pair with karthi in her First debut movie
Director Shankar daughter to pair with karthi in her First debut movie

శంకర్‌కు ముగ్గురు సంతానం. కుమారుడు అర్జిత్, కుమార్తెలు ఐశ్వర్య శంకర్, అదితి శంకర్‌. పెద్ద కుమార్తె ఐశ్యర్య వివాహం ఇటీవ‌ల‌ క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌తో జ‌రిగింది కరోనా కారణంగా మహాబలిపురంలో వీరి వివాహ వేడుకను నిరాడంబరం జరిపారు. ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరై.. నూతన వధువరులను ఆశీర్వాదించారు.


ఇప్పుడు శంక‌ర్ కూతురు సినిమాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త చ‌ర్చనీయాంశంగా మారింది. నటుడు సూర్య యొక్క 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ “విరుమన్” పేరుతో సినిమా నిర్మిస్తుంది.ఇందులో కార్తీ హీరోగా న‌టిస్తున్నాడు. కొంబన్‌లో కార్తీతో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ రాజ్ కిరణ్ “విరుమన్” లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, సూరి కీల‌క పాత్ర‌లుపోషిస్తున్నారు. అదితి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నుంది. తాజాగా ఆమెకు సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇది ఆక‌ట్టుకునేలా ఉంది.


చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో రూపొంద‌నుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం రూపొందనుండ‌గా, ఈ సినిమాకి ముత్త‌య్య‌, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించ‌నున్నారు. సెప్టెంబర్ 18న చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది.