Rajamouli: రాజ‌మౌళి జీవితంలోను తీవ్ర‌ విషాదం.. క‌న్నీరు పెట్టిస్తున్న‌ ఆయ‌న త‌ల్లి చివ‌రి రోజులు

Rajamouli టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు రాజమౌళీ. టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకధీరుడిగా నిలిచారు. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయనది. బెస్ట్ డైరెక్టర్ గా తనను తాను నిరూపించుకున్నారు. రాజమౌళి మార్క్ ఉన్న సినిమాల కోసం నిర్మాతలు, హీరోలు తెగ పోటీ పడుతున్నారు. అయితే రాజమౌళి కుటుంబం గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆయన తల్లి గురించి. ఆమె చనిపోవడం వెనుక ఎంతో దీనమైన గాధ ఉందనేది ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్య్వూలో చెప్పారు. వారిది లవ్ మ్యారేజ్ అని తెలిపారు. అందులోనూ వారిద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని అన్నారు.

తన భార్యకు స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళారని అప్పటి నుండి ఎంతో మనోవేదనకు గురయ్యామని అన్నారు. ఇంట్లోనే ఆమె ఒక గదికే పరిమితమయ్యారని.. ఆ గదినే హాస్పిటల్ బెడ్ లా మార్చినా, ఆమె ఆరోగ్యం మాత్రం బాగవ్వలేదని విజయేంద్రప్రసాద్ చెప్పారు. కోమాలో ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడేటప్పుడు తన మాటలకు స్పందించేదని అన్నారు. ఆయన భార్య ఆరోగ్యం మెరుగవడానికి ఎంతో ప్రయత్నించారని తెలిపారు. లేదా ఆయన భార్య పడే బాధ చూడలేక తీసుకెళ్ళిపోవాలని ఆ భగవంతుడ్ని అనుకున్నానని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తన భార్య చనిపోయిందని విజయేంద్ర ప్రసాద్ తన బాధను వ్యక్తం చేశారు.

ఆమె చనిపోయిన తర్వాత తన కొడుకు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా సక్సెస్ ను కళ్ళారా చూడలేకపోయారని అభిప్రాయపడ్డారు. తన భార్య తమ సక్సెస్ ను చూసి ఆనందిస్తారని.. ఆమె ఆశీర్వాదం ఎప్పుడు తన కొడుకుపై ఉంటుందని అన్నారు. ఆమె మరణించినప్పటి నుండి ప్రతిక్షణం ఆమె స్మృతులతోనే గడుపుతున్నానంటూ, ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎంతో మానసిక వేదనకు గురయ్యానని కన్నీళ్ళు పెట్టుకున్నారు. రాజమౌళి కూడా పలు సందర్భాల్లో ఆయన తల్లి గురించి చెప్పారు. ఆయన తల్లి గుర్తులు, మాటలు, ఆశీర్వాదం సదా తనతోనే ఉంటాయని అన్నారు.