Director Puri Jagannadh Mentioned Rice He Eats : పూరీ జగన్నాథ్ తినే ఈ దేశీ రకం బియ్యం ఇంత స్పెషలా.. ఎన్ని లాభాలంటే..?
NQ Staff - July 19, 2023 / 12:01 PM IST

Director Puri Jagannadh Mentioned Rice He Eats :
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అప్పుడప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రజలకు చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు హెల్త్ టిప్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వరి వంగడం గురించి ప్రస్తావించారు. ఆయన ఆ బియ్యాన్ని తరచూ తింటున్నట్టు చెప్పారు. ఈ బియ్యం పేరు రాజముడి. ఇవి కర్ణాటకలో ఎక్కువగా పండిస్తారు.
అప్పట్లో రాజుల కాలంలో ఈ బియ్యాన్ని పన్నులకు బదులుగా చెల్లించేవారు. అందుకే దీనికి రాజముడి పేరు పెట్టారు. ఈ బియ్యానికి అప్పట్లో చాలా విలువుండేది. మిగతా బియ్యం రకాలతో పోలిస్తే వీటిలో ఎక్కువ ప్రయోజనాలు ఉండేవి. అందుకే వీటిని అందరూ తినేవారు అప్పట్లో. పూరీ జగన్నాథ్ తాజాగా వీటి గురించి వివరించారు.
చాలా ప్రయోజనాలు..
చాలా రకాల వంగడాలు అంతరించిపోయినా సరే ఇవి మత్రం అంతరించిపోలేదు. అవి మిగతా బియ్యం లాగా జిగుటుగా ఉండవు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో డైటరి ఫైబర్ మరియు పోషక పదార్థాలు, zinc, calcium చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి.

Director Puri Jagannadh Mentioned Rice He Eats
ఎరుపు రంగులో ఉండే ఈ బియ్యంలో antioxidants, phytonutrients లు ఎక్కువగా ఉంటాయి . ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇవి బాగా పని చేస్తాయి. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్న వారు కూడా తినొచ్చు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఆరోగ్య నిపుణులను సంప్రదించి వీటిని తీసుకోవచ్చు.