Director Om Raut : తిరుపతి కొండపైనే ముద్దులు …ఇదేం పని ఓం అంటున్న నెటిజన్లు..

NQ Staff - June 7, 2023 / 04:21 PM IST

Director Om Raut : తిరుపతి కొండపైనే ముద్దులు …ఇదేం పని ఓం అంటున్న నెటిజన్లు..

Director Om Raut : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ”ఆదిపురుష్”.. ఈ సినిమా వచ్చే నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.. తిరుపతి వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ అభిమానుల మధ్య గ్రాండ్ గా నిన్న రాత్రి జరిగింది..

మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగియగానే వెంటనే టీమ్ అంతా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ కూడా ఉన్నారు. మరి అంతా బాగుంది అనుకునే లోపే దర్శనం అనంతరం గుడి నుండి బయటకు వచ్చిన ఓం రౌత్, కృతి సనన్ ను హగ్ చేసుకుని కిస్ చేయడంతో ఇది పెద్ద వివాదంగా మారిపోయింది.

వీరు గుడి ముందు చేసిన ఈ పనులను అంతా తప్పు బడుతున్నారు.. ముద్దులు, హగ్గులు అది కూడా శ్రీవారి గుడి ముంది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరు శ్రీవారిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. మరి అలాంటి స్వామి వారి సన్నిధిలో ఇలాంటి వేషాలు ఏంటో అని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

కొండ కింద జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన వీరు కొండ పైన పవిత్రంగా భావించే శ్రీవారి దేవస్థానంలో ఇలాంటి ముద్దులు, హగ్గులు ఎంత వరకు కరెక్ట్.. బాలీవుడ్ కల్చర్ ను ఇక్కడ వాడడానికి వారు ఎక్కడ ఉన్నారో కొంచెం అయిన స్పృహలో ఉన్నారా? అసలు వీరిది భక్తినా? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదంతో ఓం రౌత్ ఎలా స్పందిస్తారో చూడాలి..

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us