Director Maruthi డైరెక్టర్ మారుతికి సపరేట్ శైలి ఉంటుంది. కామెడీ సరిగ్గా డీల్ చేయగలడు. మాస్ ప్రేక్షకులను ఎలా మెప్పించాలో మారుతికి బాగా తెలుసు. అలాంటి మారుతి ఓ సినిమా గురించి గొప్పగా, కొత్తగా మాట్లాడాడు. అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నవ దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రం “పీనట్ డైమండ్” గురించి మారుతి కామెంట్ చేశాడు.
‘పీనట్ డైమండ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మారుతి రిలీజ్ చేస్తూ.. డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. నాతోపాటు మా బ్యానర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా వుందనిపించిందని అన్నాడు.
వాటిని జాగ్రత్తగా డీల్ చెయ్యాలంటోన్న దర్శకుడు మారుతి
అంతే కాకుండా పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్గా క్యూరియసిటీగా ఉందని మారుతి అన్నాడు. కథ లైన్ చెప్పాడని… సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని అలాంటి జోనర్లో సినిమా అంటే జాగ్రత్తగా డీల్ చెయ్యాలని మారుతి తెలిపాడు. అప్పుడే మనం అనుకున్న ఔట్ ఫుట్ వస్తుందన్నాడు. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మారుతి చెప్పుకొచ్చాడు.
1989లో ఒక కథ జరుగుతూ ఉంటే.. దానికి ప్యారలల్‌గా 2020లో మరోక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ రెండు కథలకి సంభందం ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది. అనేది మెయిన్ పాయింట్. “పీనట్ డైమండ్” టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూస్తే అర్థం అవుతుందంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు నిర్మాతలుఅభినవ్ సర్ధార్, వెంకటేష్. మొత్తానికి మారుతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదలవ్వడంతో సోషల్ మీడియాలో పోస్టర్ బాగానే వైరల్ అవుతోంది.