Harish shankar: బ్లాక్ చేయ‌డం త‌ప్ప మ‌రో దారి క‌నిపించ‌డం లేదంటున్న హ‌రీష్ శంక‌ర్

Harish shankar: ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా మానియా మ‌రింత పెరిగింది. ఇందులో వ‌స్తున్న వార్త‌లు ఎంత నిజ‌మో, ఎంత అబ‌ద్ధ‌మో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. సినిమాల విష‌యానికి వ‌స్తే ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు టైటిల్స్ ఫిక్స్ చేయ‌డం, వారికి న‌చ్చిన ద‌ర్శ‌కులు, హీరోయిన్స్ సినిమాకి ఎంపిక అయ్యార‌ని ప్ర‌చారం చేయ‌డం న‌డుస్తుంది. వీటిపై మేక‌ర్స్ కొద్ది సార్లు స్పందింస్తున్న‌ప్ప‌టికీ, మ‌రి కొద్ది సార్లు లైట్ తీసుకుంటున్నారు.

Harish Shankar

మ‌రి కొద్ది రోజుల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- హ‌రీష్ శంక‌ర్ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది. ప్రేయసి రాక కోసం ప్రియుడు ఎంత విరహ వేదనతో ఎదురు చూస్తాడో అంతే ఇంట్రెస్ట్ గా.. అదే మోజుతో ప‌వన్ సినిమాను తెర‌కెక్కించేందుకు హ‌రీష్ శంక‌ర్ ఎదురు చూస్తున్నాడు. గతంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన హరీష్ శంకర్ త్వరలో పవన్ తో ఒక సినిమాను చేసేందుకు దాదాపుగా రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.అనేక ప‌రిస్థితుల వ‌ల‌న సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది . రీసెంట్‌గా దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పవన్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి.. మీతో మళ్లీ వర్క్ చేయడం కోసం ఆగలేక పోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

హ‌రీష్ శంక‌ర్ ట్వీట్‌కు ప‌వ‌న్ భ‌క్తుడు బండ్ల గ‌ణేష్ కూడా స్పందించాడు. నేను కూడా సర్ అంటూ కామెంట్ పెట్టాడు. మ‌రి కొద్ది రోజుల‌లో హ‌రీష్ శంక‌ర్ సినిమా పట్టాలెక్కబోతుంది. కాని బండ్ల గణేష్ సినిమా పరిస్థితి ఏంటీ అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే హ‌రీష్ శంక‌ర్ సినిమాపై చాన్నాళ్లుగా ఢిఫ‌రెంట్ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకి ఊర‌మాస్ టైటిల్ ఫిక్స్ చేశార‌ని, సంచారి లేదా స్టేట్ కి ఒక్క‌డు ఈ రెండింట్లో ఒక పేరు ఫైన‌ల్ చేస్తార‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

Harish Shankar

మ‌రోవైపు ఈ చిత్రంలో ప‌వ‌న్ డ్యూయ‌ల్ పాత్ర పోషించ‌నున్న‌ట్టు కూడా పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జ‌రుగుతున్న పుకార్ల‌పై తాజాగా హ‌రీష్ శంకర్ స్పందించాడు. సంచారి లేదా స్టేట్‌కి ఒక్క‌డు లేదంటే ఊర మాస్ టైటిల్‌ని సినిమాకి ఫిక్స్ చేస్తార‌ట క‌దా అని ఓ నెటిజ‌న్ అడ‌గా, ఈ విష‌యంపై స్పందించిన హరీష్ శంకర్.. ఇవి నా దృష్టికి ఇది కూడా వచ్చాయి. గాసిప్స్ ప్రచారం చేస్తున్న వారిని బ్లాక్ చేసేస్తున్నాని అంతకు మించి మరో దారి కనబడలేదు అని క్లారిటీ ఇచ్చారు.