Director Gunasekhar : గుణ శేఖర్‌ కి గ్రాఫిక్స్ సెట్‌ అవ్వవు

NQ Staff - April 14, 2023 / 11:30 AM IST

Director Gunasekhar : గుణ శేఖర్‌ కి గ్రాఫిక్స్ సెట్‌ అవ్వవు

Director Gunasekhar : భారీ చిత్రాల దర్శకుడుగా పేరు దక్కించుకున్న దర్శకుడు గుణ శేఖర్ గత చిత్రం రుద్రమదేవి తో ఆశించిన స్థాయిలో భారీ కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గుణశేఖర్‌ కి మరోసారి నిరాశ ఎదురయింది.

రుద్రమదేవి సినిమాలో గ్రాఫిక్స్ విషయమై విమర్శలు ఎదుర్కొన్న దర్శకుడు గుణశేఖర్ అచ్చు అదే విమర్శలను శాకుంతలం సినిమా విషయంలో కూడా ఎదుర్కొంటున్నాడు. గ్రాఫిక్స్ విషయంలో అస్సలు పట్టులేని గుణశేఖర్ ఎందుకు గ్రాఫిక్స్ నేపథ్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారని కొందరు సినిమా చూసినవారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గుణశేఖర్ కి భారీ సెట్టింగ్స్ సెట్ అవుతాయేమో కానీ గ్రాఫిక్స్ సెట్ అవ్వని మరో సారి నిరూపితమైంది. కనుక వచ్చేసారైనా గ్రాఫిక్స్ లేకుండా సినిమాను తీసే విధంగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us