Shakuntalam Movie: సమంత ‘శాకుంతలం’ రిలీజ్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

NQ Staff - September 22, 2022 / 03:05 PM IST

Shakuntalam Movie: సమంత ‘శాకుంతలం’ రిలీజ్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Shakuntalam Movie: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు గత ఏడాది కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇటీవల సినిమా విడుదల తేదీ

ఇంకా ప్రకటించడం లేదంటూ దర్శకుడు గుణ శేఖర్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన సమంత అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు రేపో సమంత నటించిన శాకుంతలం సినిమా యొక్క రిలీజ్ డేట్ ని దర్శకుడు గుణశేఖర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Director Gunasekhar Going Announce Release date of Shakuntalam Movie

Director Gunasekhar Going Announce Release date of Shakuntalam Movie

ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసిన గుణ శేఖర్ గత కొన్ని నెలలుగా గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హోం బ్యానర్ లో గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.

దిల్ రాజు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చాడు, ఈ సినిమాలో సమంత లుక్ ఇప్పటికే ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. సినిమాలో అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

మొత్తానికి భారీ అంచనాలు ఉన్నాయి సినిమాను డిసెంబర్ తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ నిర్ణయించుకున్నారని వచ్చే నెల నుండి ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయని సమాచారం అందుతుంది.

తెలుగు భాషలోనే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో మరియు నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సమంతకి అక్కడ ఇక్కడ అన్నిచోట్ల మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ సినిమా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటూ గుణ శేఖర్ టీం నమ్మకంతో ఉందట.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us