Director Guna Shekhar : దర్శకుడు గుణ శేఖర్ కుమార్తె నీలిమ పెళ్ళి కూతురాయెనే.!
NQ Staff - December 2, 2022 / 01:37 PM IST

Director Guna Shekhar : ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ఇంట పెళ్ళి సందడి మొదలైంది. గుణశేఖర్ కుమార్తె నీలిమ పెళ్ళి పీటలెక్కనుంది. తాజాగా ‘పెళ్ళికూతుర్ని’ చేశారు నీలిమని. ఈ వేడుకకి సంబంధించిన ఫొటోల్ని, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నీలిమ.
బంధువులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేసి పెళ్ళికూతురిగా మారిన నీలిమను ఆశీర్వదించారు.
తండ్రికి తగ్గ తనయ..
గుణ శేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుణశేఖర్ రూపొందించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.

Director Guna Shekhar House Started Buzzing
కాగా, నీలిమకి కాబోయే భర్త పేరు రవి. ఆయన వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా వుంటారట. కోట్లకు అధిపతి అని తెలుస్తోంది.
నీలిమ వివాహం నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ అందిస్తున్నారు.