నిక్కర్ వేసుకోవడానికి బయపడి బన్నీ సినిమా లో ఛాన్స్ వదులుకున్న డైరక్టర్ ఎవరో తెలుసా..?

Allu Arjun: న‌టులుగా వెండితెర‌పై రాణించాలంటే చాలా ధైర్యం కావాలి. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో అస‌మాన న‌ట‌నాప‌టిమ ప్ర‌ద‌ర్శిస్తేనే స్టార్ హీరోలుగా మారతారు. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్ప‌డం క‌ష్టం. హీరోగా అవుదామ‌నుకున్న వాళ్లు రైటర్స్‌గానో లేదంటే ద‌ర్శ‌కులుగా మార‌తారు. అదే ద‌ర్శ‌క నిర్మాత‌లుగా స‌త్తా చాటాల‌నుకున్న వారికి హీరో ఛాన్స్‌లు రావ‌డం, వారు సూప‌ర్ స్టార్స్ కావ‌డం చాలానే జ‌రిగాయి.

Director Bobby Missed Chance in Allu Arjun Movie
Director Bobby Missed Chance in Allu Arjun Movie

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి సినిమాలు తీసి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు బాబి. అయితే ఈ ద‌ర్శ‌కుడికి చిన్న‌ప్పుడే న‌టించే ఛాన్స్ వ‌చ్చింద‌ట‌. అది కూడా బ‌న్నీ ప‌క్క‌న‌. కాని దాన్ని రిజెక్ట్ చేశాడు. అందుకు కార‌ణం నిక్క‌ర్ వేసుకోమ‌న్నందుకు.

ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి అనే సినిమా తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ద‌ర్శ‌కేంద్రుడి 100వ సినిమా కావ‌డంతో అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉండేవి.గంగోత్రి సినిమా ద్వారా అల్లు అర్జున్ – అదితి అగర్వాల్ ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్స్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమాకు చిన్నికృష్ణ కథను అందించిన విషయం తెలిసిందే.

బలుపు, జై లవకుశ, వెంకీమామ దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) వంటి చిత్రాలు తెర‌కెక్కించిన బాబీ త‌న పరువు కోసం గంగోత్రి సినిమాలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడట. గుంటూరులో బాబీ చిరంజీవి అధ్య‌క్షుడిగా ఉండేవారు. ఓ సారి చిన్నికృష్ణను క‌లుసుకున్నారు.అప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు త‌న‌ని క‌ల‌వ‌మ‌ని చెప్పాడ‌ట‌. అలా చిన్నికృష్ణ‌ని బాబీ ఓ సంద‌ర్భంలో క‌ల‌వ‌గా, ఓ సారి రైట‌ర్ .. కె.రాఘవేంద్రరావు దగ్గరకు తీసుకు వెళ్లాడు.

గంగోత్రి సినిమా స‌మ‌యంలో బాబీని రాఘవేంద్ర‌రావుతో క‌లిపించాడు చిన్ని కృష్ణ‌. అప్పుడు హీరో ప‌క్క‌న ఉండే ఓ పాత్ర ఉంది అందుకోసం గెట‌ప్ మార్చుకొని రావాల‌ని చెప్పాడ‌ట ద‌ర్శ‌కుడు. బాబీ నిక్కర్ వేసుకోవాలని అందుకోసం కొలతలు తీసుకోమ్మన్ని సహాయక దర్శకుడికి చెప్పారట. అయితే రాఘవేంద్రరావు అతన్ని సెలెక్ట్ చేసింది కేవలం హీరో పక్కన ఒక ఫ్రెండ్ పాత్ర కోసమే. ఇక నిక్కర్ వేసుకుంటే గుంటూరులో తన పరువు పోతుందని బాబీ వెంటనే ఆ ఆఫర్ వద్దని అన్నాడట.

న‌టించ‌క‌పోతే మ‌రేం చేస్తావు అని చిన్ని కృష్ణ బాబీని అడ‌గ‌గా, అత‌డు క‌థ‌లు రాస్తాన‌ని అన్నాడ‌ట‌. వెంట‌నే ఆ సినిమాలో కొన్ని సీన్స్ రాయ‌మ‌ని చెప్ప‌డంతో అద్భుతమైన సీన్స్ రాసి ఇచ్చాడట. దీంతో ఆయ‌న‌కు పలు సినిమాలకు రైటర్ గా వర్క్ చేసే అవ‌కాశం ద‌క్కింది. అనంత‌రం బాబీ దర్శకుడి స్థాయికి చేరుకున్నారు.