NTR: ఎన్టీయార్ కోసం చెన్నయ్ నుంచి బిర్యానీ తీసుకొచ్చిన డైరెక్టర్ అట్లీ.!
NQ Staff - June 13, 2022 / 11:28 PM IST

NTR: యంగ్ టైగర్ ఎన్టీయార్ భోజన ప్రియుడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ‘భోజన ప్రియత్వం’ వల్లనే బాగా లావెక్కిపోయానని కూడా చెబుతుంటాడాయన. ఇప్పటికీ ఆ భోజనం పట్ల ఆయనకున్న ఇష్టం తగ్గలేదు. కాకపోతే, అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటుంది. సినిమా కోసం ఎంత కష్టమైన పడటంలో అప్పుడూ ఇప్పుడూ ఒకటే అయినా, భోజనం విషయంలో కొంచెం జాగ్రత్తగా వుంటున్నాడు.

Director Atlee Bring Thalapakattu Biryani to NTR
అసలు విషయానికొస్తే, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి చెన్నయ్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు సునీల్ చెప్పారు. ‘తలపాకట్టి బిర్యానీ’ పేరుతో చెన్నయ్‌లో ఓ బిర్యానీ సూపర్ ఫేమస్.
NTR: ఎన్టీయార్ తలపాకట్టి బిర్యానీ.!
తమిళ దర్శకుడు అట్లీ, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి ఓ కథ చెప్పాలకున్నాడట. ఈ క్రమంలో ఎన్టీయార్‌ని కలిసేందుకు అట్లీ వెళుతుండగా, వచ్చేటప్పుడు తలపాకట్టి బిర్యానీ తీసుకురావాల్సిందిగా ఎన్టీయార్ కోరాడట అట్లీని. దాంతో, అట్లీ, ఆ బిర్యానీని ఆర్డర్ చేశాడట.
‘వచ్చి తిని వెళ్ళొచ్చు కదా..’ అని అట్లీతో తనకున్న పరిచయం నేపథ్యంలో సునీల్ చెప్పారట. కానీ, అది తన కోసం కాదనీ, ఎన్టీయార్ కోసమనీ అట్లీ చెప్పాడట. దాంతో, సునీల్ ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని తాజాగా సునీల్ వెల్లడించారు.

Director Atlee Bring Thalapakattu Biryani to NTR
హైద్రాబాద్ పేరు మీదనే హైద్రాబాద్ బిర్యానీ ఫేమస్. చెన్నయ్‌లో తలపాకట్టి బిర్యానీ కూడా ఫేమస్. ఆ బిర్యానీకి యంగ్ టైగర్ ఎన్టీయార్ వీరాభిమాని అన్నమాట. ఇంతకీ, అట్లీ దర్శకత్వంలో ఎన్టీయార్ నటించబోయే సినిమా ఎప్పుడో.!