Ajay Bhupathi: మ‌ద్ధ‌తు ఇచ్చిన వారికే క్యారెక్ట‌ర్స్.. ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Ajay Bhupathi: మా ఎన్నిక‌ల ప్ర‌చారాలు చాలా హాట్ హాట్‌సా సాగుతున్నాయి. సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగానే ఇక్క‌డ కూడా తాయిలాలు, బ్లాక్ మెయిలింగ్ న‌డుస్తుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తన ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. నాకు నచ్చిన ప్యానల్‌కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా. ఇది ఓ దర్శకుడి అల్టిమేటమ్‌.

Director Ajay Bhupathi Comments on Maa Elections
Director Ajay Bhupathi Comments on Maa Elections

అవును.. మా ఎన్నికల్లో భాగంగా కాల్‌ చేసిన ఓ డైరెక్టర్‌ మొహమాటం లేకుండా డైరెక్ట్‌గా అదే మాట అనేశాడు. ఇదే మాటను ట్వీట్‌ చేశాడు ఆర్‌ఎక్స్‌ 100 మూవీ దర్శకుడు అజయ్‌భూపతి. ఆయనకు ఏ డైరెక్టర్‌ కాల్‌ చేసి అలా అన్నారన్నది మాత్రం వెల్లడించలేదు.

ఒక వైపు మంచు విష్ణు ప్యానల్ , మరోవైపు ప్రకాష్‌రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఈ రెండు ప్యానళ్ల సభ్యులు ఒకరిపై ఒకరు పోటాపోటీగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ఒకవైపు వార్ నడుస్తూనే ఉంది. మరోవైపు కరాటే కళ్యాణి, హేమ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లోకల్, నాన్ లోకల్ అంటూ వార్ మొదలైంది.

ఈ నేపథ్యంలో ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ట్వీట్ సెన్సేషన్‌గా మారింది. మ‌రో ట్వీట్‌లో ఈ థ్రిల్లర్ ఎపిసొడ్‌లు చూస్తుంటే నాక్కూడా రెండు మూడు సినిమాల్లో నటించి, ‘మా’లో కార్డు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనుంది”.. అని అన్నారు. ఇలా ఎందుకు అన్నారో తెలీదుగానీ ప్రస్తుతం ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా అక్టోబర్ 14 న ‘మహా సముద్రం’ రిలీజ్ కాబోబోంది. అందరూ తప్పకుండా థియేటర్స్‌లో చూడండి అంటూ పేర్కొన్నారు. ఏదేమైన అజ‌య్ కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.