Dimple Hayathi : ఆ పనికి ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు.. డింపుల్ హయతీ ఆరోపణలు..!
NQ Staff - June 15, 2023 / 04:05 PM IST

Dimple Hayathi : డింపుల్ హయతీకి కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కత్తిలాంటి అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. ఖిలాడీ సినిమాలో ఆమె షేపులు చూసి అంతా షేక్ అయిపోయారు. దాంతో ఆమె కుర్రాళ్లకు హాట్ ఫిగర్ అయిపోయింది. రీసెంట్ గానే రామబాణం సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ కూడా ప్లాప్ అయింది.
దాంతో డింపుల్ హయతీ కు సినిమాల ఆఫర్లు పెద్దగా రావట్లేదు. కానీ అప్పుడప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గానే ఓ డీస్పీతో వివాదంతో ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది.
వాస్తవంగా గద్దలకొండ గణేశ్ సినిమాలో హీరోయిన్ గా నేనే చేయాల్సింది. కానీ వేరే పెద్ద డైరెక్టర్ తో అంతకు ముందే సినిమాకు కమిట్ అయ్యాను. ఆ పెద్ద డైరెక్టర్ నాతో 60 శాతం షూటింగ్ కూడా చేశాడు. కానీ ఎడిటింగ్ రూమ్ లో నా డ్యాన్స్ గురించి చర్చ పెట్టాడు. నా డ్యాన్స్ బాగా రాలేదని నిర్మాతతో చెప్పాడు.
దాంతో ఇద్దరూ కలిసి నన్ను సినిమా నుంచే తీసేశారు. చాలా బాధగా అనిపించింది. ఆ సమయంలోనే హరీశ్ శంకర్ గారు నాకు ఫోన్ చేసి గద్దల కొండ గణేశ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది చేస్తావా అని అడిగారు. దాంతో వెంటనే ఓకే చెప్పేశాను. ఇప్పుడు మంచి సినిమాలు వస్తున్నాయి. త్వరలోనే మరో సినిమా స్టార్ట్ కాబోతోంది అంటూ తెలిపింది డింపుల్.