DilRaju: బంగార్రాజుకి దిల్ రాజు రూపంలో కొత్త త‌ల‌నొప్పి..!

DilRaju: క‌రోనా వ‌ల‌న అన్ని సినిమాలు వాయిదా ప‌డుతున్నా కూడా తాను అన్నింటిని ఎదుర్కొంటూ జ‌న‌వ‌రి 14న బంగార్రాజు చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు నాగార్జున‌. ఈ అక్కినేని మల్టీస్టారర్ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమా కు కొనసాగింపు గా వస్తున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని నాగార్జున కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

DilRaju
DilRaju

అక్కినేని అన్నపూర్ణ స్టూడియో తో పాటు జీ స్టూడియోస్ కూడా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కేవలం స్క్రిప్ట్ కోసం అతను రెండేళ్లపాటు చాలా కష్టపడ్డాడు. అంతేకాకుండా సినిమా సెట్స్ పైకి వచ్చిన తర్వాత చాలా వేగంగా ఫినిష్ చేసేందుకు కూడా పర్ఫెక్ట్ ప్లాన్ ముందుకు సాగుతూ వచ్చాడు.

ఇక ఈ సినిమాకి పోటీగా రౌడీ బాయ్స్ అనే సినిమా విడుద‌ల కాబోతుంది. జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల‌ ఈ సినిమా ట్రైల‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి.. చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైల‌ర్ చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచింది. అయితే రౌడీ బాయ్స్ కోసం దిల్ రాజు 25 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతను AP మరియు TS లో మెజారిటీ థియేటర్లను లాక్ చేసే అవ‌కాశం ఉంది. బంగార్రాజు కంటే ఎక్కువ థియేటర్లలో రౌడీ బాయ్స్ రిలీజ్ అవుతుందని టాక్. దీంతో నాగ్ సినిమాకి క‌లెక్ష‌న్స్ డ్రాప్ అయ్యేఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

DilRaju
DilRaju

మ‌రోవైపు ఇటీవ‌ల నాగార్జున ఇటీవ‌ల చేసిన కామెంట్స్ తో డిస్ట్కిబ్యూట‌ర్స్ గుర్రుగా ఉన్నారు. బంగార్రాజుని ఆడ‌నివ్వ‌మంటూ శ‌ప‌థాలు చేశారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల‌లో బంగార్రాజు ఎలా రాణిస్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.