DIL RAJU మూడేళ్ల పాటు సినిమాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానులకే కాక సెలబ్రిటీలకు సైతం పూనకం తెప్పిస్తున్నాడు. వెండితెర పై ఆయన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చూడక మొహం వాచి ఉన్న సినీ ప్రేక్షకులు వకీల్ సాబ్ చిత్రంతో పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. సినిమా రిలీజ్ కాకముందే థియేటర్‌కు చేరుకొని నానా హంగామా సృష్టిస్తున్నారు. అన్ని థియేటర్స్ దగ్గర ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం వకీల్ సాబ్ సినిమా చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం వకీల్ సాబ్ సినిమా చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రం తన ఫ్యామిలీతో కలిసి థియేటర్లో వకీల్ సాబ్ సినిమా చూస్తానంటూ ట్వీట్ చేయడంతో వకీల్ సాబ్ మానియా ఏ రేంజ్లో ఉందనేది అర్ధమవుతుంది. ఈ రోజు తెల్లవారుఝామున కొన్ని చోట్ల వకీల్ సాబ్ బెనిఫిట్ షోస్ ప్రదర్శించగా, ఈ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. శివ పార్వతి 70 ఎంఎం థియేటర్లో వేసిన బెనిఫిట్ షోకు దిల్ రాజు తన సతీమణితో కలిసి హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించే సరికి ఆయనలో దాగి ఉన్న ఆనందం ఆపుకోలేక పేపర్స్ విసిరేశాడు.
దిల్ రాజు ఓ డై హార్డ్ ఫ్యాన్ లా మారి వకీల్ సాబ్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్స్ భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ మానియాకు బాక్సాఫీస్ బద్దలు కావల్సిందే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించగా, ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించింది. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. థమన్ బాణీలు సమకూర్చారు. తొలి షో నుండే ఈ సినిమా దూసుకుపోతుంది.
దిల్ మామ మాస్ 🔥 🔥#VakeelSaabDay pic.twitter.com/mKVmkdBgLv
— సిద్దు- సంధ్య (@siddu404) April 8, 2021