Dil Raju : దిల్ రాజును భయపెడుతున్న బడా ప్రొడక్షన్ హౌస్.. అందుకేనా ఈ అసహనం..!

NQ Staff - January 10, 2024 / 09:37 AM IST

Dil Raju : దిల్ రాజును భయపెడుతున్న బడా ప్రొడక్షన్ హౌస్.. అందుకేనా ఈ అసహనం..!

Dil Raju :

టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే తెలియని వారు ఉండరేమో. సాధారణంగా ప్రొడ్యూసర్ అంటే జనాలకు పెద్దగా తెలియదు. ఎందుకంటే వారు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించరు. వారు డబ్బులు మాత్రమే పెట్టగలరు. అందుకే చాలామంది నిర్మాతలు అంటే అసలు జనాలకు పెద్దగా తెలియదు. కానీ దిల్ రాజు మాత్రం సెలబ్రిటీ స్థాయిలో రాణిస్తున్నారు. ఆయన అంటే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది మరి. ఎందుకంటే పెద్ద సినిమాలు తీయడంలో దిల్ రాజు స్పెషాలిటీ వేరు. ఆయన సినిమా అంటే మాక్సిమమ్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటారు.

అందుకే ఆయన తీస్తున్న సినిమాలు అంటే ఎవరైనా సరే ఎగబడి మరీ కొనేస్తారు. పైగా పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ల మధ్య కాంబినేషన్లు సెట్ చేయాలంటే దిల్ రాజు తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ గా దిల్ రాజు మీద తీవ్రమైన కామెంట్లు వస్తున్నాయి. ఆయన ఇప్పుడు హనుమాన్ సినిమాకు అసలు థియేటర్లు ఇవ్వట్లేదనే వాదన వస్తోంది. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాకు ఆయనే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. నైజాంలో దిల్ రాజుకు తిరుగు లేదు. ఇప్పటి వరకు ఆయనకు పోటీ లేకుండా సాగిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఆయన రీసెంట్ గా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఫ్రస్ట్రేట్ అయ్యారు.

మరీ ముఖ్యంగా ఓ రెండు వెబ్ సైట్లు పనిగట్టుకుని తన గురించి చెడుగా రాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంతకీ దిల్ రాజు చెప్పిన ఆ వెబ్ సైట్లు ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. కాగా దిల్ రాజు అసహనానికి అసలు కారణం ఇది కాదంట. దానికి కారణం మరో పెద్ద ప్రొడక్షన్ సంస్థ అని తెలుస్తోంది. అది ఏదో కాదు మైత్రీ మూవీస్. ఈ సంస్థ వచ్చినప్పటి నుంచి పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ హౌస్ ను కూడా ఓపెన్ చేసింది. సలార్ సినిమాను మొన్న వీరే రిలీజ్ చేశారు. అంతే కాకుండా పెద్ద సినిమాలు మొత్తం వారే రిలీజ్ చేస్తున్నారు.

దాంతో దిల్ రాజుకు పెద్ద సినిమాలు లేకుండా పోతున్నాయి. అంతే కాకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మొత్తం వారే లాగేసుకుంటున్నారంట. దాంతో దిల్ రాజుకు బిజినెస్ లేకుండా పోతోంది. అందుకే ఆయనలో అసహనం కనిపిస్తోందని అంటున్నారు. ఇన్ని రోజులు ఇది లోలోపల ఉండేది.

కానీ ఇప్పుడు ఇది బహిర్గతం అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మైత్రీ మూవీస్ పేరు మాత్రం దిల్ రాజు తీయట్లేదు. కేవలం తన అసహనాన్ని మాత్రమే బయట పెడుతున్నారు. ఇప్పుడు మైత్రీ మూవీస్ వారు పెద్ద సినిమాలను నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు వారి ఖాతాలో ఉన్నాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us