Dil Raju : సూపర్ స్టార్‌ చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

NQ Staff - November 1, 2022 / 09:18 AM IST

Dil Raju : సూపర్ స్టార్‌ చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?

Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ చేతిలో ఉన్న ఈ క్యూట్ బాబు ఎవరో తెలుసా? మరెవరో కాదండి మన తెలుగు స్టార్ నిర్మాత దిల్ రాజు తనయుడు. ఇటీవల దిల్ రాజు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. కరోనా సమయం లో తేజస్విని ని పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఇటీవల తండ్రి అయ్యాడు.

తండ్రి అయిన తర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు తన కొడుకు ఫోటోను చూపించ లేదు. మొదటి సారి విజయ్ ఎత్తుకొని ఉండగా ఫోటో తీయడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దిల్ రాజు నిర్మాణం లో ప్రస్తుతం విజయ్ వారసుడు అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో వారసుడు చిత్రీకరణ జరుగుతున్న సందర్భంగా ఆ ప్లేస్ కి దిల్ రాజు తన కొడుకును తీసుకు వెళ్లాడు. ఆ సందర్భంగా షూటింగ్ గ్యాప్ లో విజయ్ ఇలా దిల్ రాజు కొడుకుని ఎత్తుకొని ముద్దు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటో ని మీరు ఒక లుక్ వేయండి.

దిల్ రాజు కి ముసలి వయసులో పెళ్లి అవసరమా అంటూ చాలా మంది విమర్శలు చేశారు. పెళ్లి అవసరం లేకున్నా తోడు అవసరం అయితే ఆ వయసులో చాలా ఉంటుంది.. అందుకే ఆయన పెళ్లి చేసుకోవడం అవసరం అంటూ స్వయంగా ఆయన బిడ్డ ఒత్తిడి చేసి మరీ పెళ్లి చేసింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడం వల్ల ఆయన పెళ్లి చేసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Dil Raju son with Tamil Hero Vijay

Dil Raju son with Tamil Hero Vijay

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us