Vijay : సూపర్ స్టార్‌ ను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్న దిల్‌ రాజు

NQ Staff - January 10, 2023 / 08:21 AM IST

Vijay : సూపర్ స్టార్‌ ను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్న దిల్‌ రాజు

Vijay : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తెలుగులో వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాధారణంగా విజయ్ నటించిన సినిమాలు ఈ మధ్య అన్ని తెలుగులో డబ్ అవుతున్నాయి, కానీ వారసుడు సినిమా మాత్రం వాటితో పోల్చితే విభిన్నం.

తెలుగు దర్శకుడి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. కనుక ఈ సినిమాను తెలుగు సినిమా గానే పరిగణించాలంటూ కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కూడా వారసుడు సినిమాను తెలుగు సినిమా గానే ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.

విజయ్ ఈ సినిమా కోసం హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం ఆయన ఎప్పుడూ కూడా హైదరాబాద్ రాలేదు.

తమిళనాడులో కూడా సినిమాకు కేవలం ఒకే ఒక్క ఈవెంట్ లేదా ఇంటర్వ్యూ మాత్రమే ఆయన హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆయన తీసుకొచ్చేందుకు నిర్మాత దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట.

తాజాగా సినిమాను 11వ తారీకు కాకుండా 14వ తారీఖున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఆ సందర్భంగా మీడియా వారు విజయ్ ని తీసుకువచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటూ దిల్ రాజును ప్రశ్నించగా 11 వ తారీకు రిలీజ్ కి విజయ్ వచ్చేందుకు నిరాకరించారు, కానీ విడుదల తేదీ మారింది కనుక ఆయన కచ్చితంగా హైదరాబాద్ వస్తాడని భావిస్తున్నాను.. త్వరలోనే ఆయన్ని అడుగుతానంటూ దిల్ రాజు పేర్కొన్నాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us