Dil Raju : వారసుడు కుమ్మేస్తున్నాడన్నా దిల్ రాజు.. నిజమేనా?

NQ Staff - January 18, 2023 / 02:47 PM IST

Dil Raju : వారసుడు కుమ్మేస్తున్నాడన్నా దిల్ రాజు.. నిజమేనా?

Dil Raju  : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమా తెలుగు లో వారసుడుగా విడుదలయింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకు పోతుంది. ఇప్పటి వరకు 210 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని ఈ సినిమా రాబట్టింది అంటూ దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

కేవలం 7 రోజుల్లోనే ఈ సినిమా రాబట్టిన వసూళ్ల ప్రభంజనం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ తమిళ విజయ్ ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. తెలుగులో వారసుడు రాబడుతున్న కలెక్షన్స్ పరిస్థితి ఏంటి అనేది అధికారికంగా చెప్పడం లేదు.

Dil Raju Production Company Announced It Has Collected 210 Crore Rupees

Dil Raju Production Company Announced It Has Collected 210 Crore Rupees

కానీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 210 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసింది అంటూ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. విజయ్, దిల్ రాజు కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా కనుక తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కానీ ట్రైలర్ చూడడంతోనే సినిమాపై జనాలు ఆసక్తి తగ్గింది. తమిళ జనాలు మాత్రం వారసుడు ను తెగ ఆదరిస్తున్నారు. కలెక్షన్స్ ఫేక్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ తమిళనాడు లో విజయ్ కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఈ కలెక్షన్స్ నమోదయ్యే ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us