Dil raju: రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమా కోసం అప్పుడే బెర్త్ రెడీ చేసిన దిల్ రాజు.. మ‌రీ ఇంత స్పీడా..!

Dil raju: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రూట్ మార్చేశాడు. అన్ని బడా ప్రాజెక్టులు చేయాల‌ని అనుకుంటున్నాడు. ప్ర‌స్తుతం త‌న మార్కెట్‌ను పెంచుకోవ‌డానికి ఆస‌క్తిక‌ర‌ ప్రాజెక్ట్‌ల‌ను ఎంచుకుంటున్నారు. త‌దుప‌రి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చ‌ర‌ణ్ ప్లాన్ చేసుకుని అందుకు త‌గ్గ‌ట్టు ప్రాజెక్టుల‌ను డిసైడ్ చేసుకుంటున్నారు.

dil raju new plan on rc 152
dil raju new plan on rc 152

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో. RC15గా రూపొందుతుండ‌గా, ఈ భారీ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఆర్‌సీ 15 కోసం శంక‌ర్ ఇప్ప‌టికే కొంత మేర‌కు షూటింగ్ పూర్తి చేశారు. లేటెస్ట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత దిల్ రాజు రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. అన్నీ అనుకుంటున్న‌ట్లు ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే, రామ్ చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాను 2023 సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అంటే మ‌రో సంక్రాంతికి కూడా సంద‌డి చేయ‌డానికి దిల్ రాజు ప్లాన్ చేసేశారు. ఇత‌ర నిర్మాత‌లంద‌రి కంటే ముందే సంక్రాంతి బెర్తుని క‌న్‌ఫ‌ర్మ్ చేసేసుకున్నార‌న్న‌మాట‌. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పూర్తి చేసిన రామ్‌చ‌ర‌ణ్ ఆ వెంట‌నే పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా చేయాల‌నుకుని శంక‌ర్‌తో చేతులు క‌లిపారు. తెలుగు నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించ‌డానికి రెడీ అయ్యారు. వీరు నిర్మిస్తోన్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది.

ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌ను స‌రికొత్త లుక్‌తో, క్యారెక్ట‌రైజేష‌న్‌తో శంక‌ర్ ప్రెజెంట్ చేయ‌బోతున్నారు. క‌లెక్ట‌ర్‌గా, మ‌రో వేరియేష‌న్‌లో ముఖ్య‌మంత్రిగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నార‌ట‌. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సాధార‌ణంగా శంక‌ర్ సినిమా అంటే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అనొచ్చు.

dil raju new plan on rc 15
dil raju new plan on rc 15

ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమాలకు దాదాపు 50 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నాడని ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు దానిని డబుల్ చేశాడని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్‌కి 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచేశాడంటూ వస్తున్న షాకింగ్ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.