DIL RAJU: అర్జెంటుగా అమెరికా చెక్కేసిన దిల్ రాజు.. ఎందుకో తెలుసా?

ప్ర‌స్తుతం ఇండియాలో క‌రోనా ఉగ్ర‌రూపం దాలుస్తుంది. రోజుకు ల‌క్ష‌ల‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త ప్ర‌జ‌ల‌ను ఇత‌ర దేశాల వారు ఏ మాత్రం అనుమ‌తించ‌డం లేదు. అమెరికా కూడా భార‌తీయుల‌ని మే 4 నుండి త‌మ దేశంలోకి అనుమ‌తించ‌డం లేదు. ఇది ముందుగానే తెలుసుకున్న టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు త‌న భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని తీసుకుని మే 3న అమెరికా వెళ్లిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఎప్ప‌టి నుండో వీరు ఈ ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంద‌ట‌.

దిల్ రాజుకు ఇటీవ‌ల క‌రోనా సోక‌గా,రీసెంట్‌గా కోలుకున్నారు. కోలుకున్న వెంట‌నే త‌న భార్య‌ను తీసుకొని అమెరికాకు వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. పెళ్లైనద‌గ్గ‌ర నుండి ఇద్ద‌రు ఏకాంతంగా గ‌డిపేందుకు ఎక్క‌డికి వెళ్ల‌క‌పోవ‌డంతో విశ్రాంత స‌మయాన్ని అమెరికాలో గ‌డిపేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తుంది. రెండు నుంచి మూడు వారాల దాకా ఈ దంపతులు అక్కడే ఎంజాయ్‌ చేయనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం దిల్ రాజు సమంత శాకుంత‌లం,అవసరాల శ్రీనివాస్‌ ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’, రామ్‌ చరణ్‌- శంకర్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌, వెంక‌టేష్‌- వ‌రుణ్ తేజ్ కాంబోలో రూపొందిన ఎఫ్ 3 చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు.

Advertisement