Dil Raju : ఆదిపురుష్, రావణం, జటాయు, రామాయణం.. మైథాలజీ బ్యాక్ డ్రాప్ తో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టులు. నిర్మాతల సూపర్ ప్లాన్
NQ Staff - January 17, 2023 / 01:38 PM IST

Dil Raju : ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల హవా పెరిగిన తర్వాత భాషలతో సంబంధం లేకుండా భారీ బడ్జెటుతో బడా స్టార్ కాస్టింగ్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటివరకూ ఊహించని కాంబినేషన్లలో కూడా కొత్త కొత్త సినిమాలు,లార్జర్ దేన్ లైఫ్ మూవీస్ అఫీషియల్ గా అనౌన్సవుతున్నాయి కూడా. త్రిబులార్ లాంటి పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు హిట్టయ్యాక మైథాలజీ నేపథ్యమున్న సినిమాలపై కన్నేశారు పెద్ద నిర్మాతలు.
ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే భారీ సినిమా రిలీజుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రామాయణం, అందులోని సన్నివేశాలు, పాత్రల నేపథ్యంతో మరిన్ని కొత్త చిత్రాలు కూడా అనౌన్సవడం విశేషం.
వారిసు మూవీతో కోలీవుడ్ లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు త్వరలో శంకర్, చరణ్ కాంబినేషన్లో వస్తోన్న మూవీతో సౌత్ వైడ్ గా తన బిజినెసుని మరింత విస్తరించుకోవడం పక్కా. అయితే ఇంకా ఆ మూవీ సెట్స్ పై ఉండగానే తన బ్యానర్ నుంచి రానున్న బడా సినిమాలను రివీల్ చేసేశాడు దిల్ రాజు. మోహనక్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో జటాయు, హిట్ మూవీ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో విశ్వంభర, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగులో రావణం అనే ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయట.
ఇప్పటివరకూ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెయినర్లతోనే సాగిపోతున్న దిల్ రాజు ఊహించని విధంగా ఇలాంటి వరుస ప్రాజెక్టుల్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంలో అందరూ షాకయ్యారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ చిత్రాలంటే కచ్చితంగా భారీ బడ్జెట్ తో పాటు మేకింగ్ పరంగానూ శ్రమతో కూడుకున్న పని. సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా అన్ని రకాలుగా డబుల్ వర్కే. మరోవైపు ఈ జానర్ చిత్రాలకి రెస్పాన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.
ఇండియన్ మైథాలజీల్లో పాత్రల మధ్య ఎమోషన్, ఎఫెక్షన్ తో పాటు ఒక్కో సందేశం కూడా ఉంటుంది. అవ్వన్నింటిని ప్రాపర్ గా స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ చేయగలిగి, వాటికి విజువల్ గ్రాండియర్ కూడా తోడైతే బాక్సాఫీస్ దగ్గర కాసుల పంటే. ఎటొచ్చీ రైటింగ్ స్టేజ్ నుంచి తెరపై బొమ్మ పడేవరకు పక్కా ప్లానింగ్ అండ్ డెడికేషన్ తో వర్క్ చేయడం, వెనక్కి తగ్గకుండా ఖర్చు పెట్టడమే కావల్సిన మెయిన్ థింగ్స్.
ఎంతయినా మైథాలజీ చిత్రాలంటే పెద్దలతో పాటు పిల్లలకి కూడా ఆసక్తే. దాంతో కుటుంబంమంతా కలిసి సినిమాకొస్తే వసూళ్ల జాతరే ఇక. ఇలాంటి సక్సెస్ ఫార్ములాలని నమ్ముకునే నిర్మాతలు వందల కోట్లు పెట్టడానికయినా ధైర్యం చేస్తున్నారు.
అప్పట్లో అల్లు అరవింద్ కూడా మూడు భాగాలుగా రామాయణం ప్రాజెక్టుని నిర్మిస్తున్నామంటూ అఫీషియల్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకూ మళ్లీ ఆ ఊసే లేదు. ఇప్పటికే ఆదిపురుష్ ప్రాజెక్ట్ మీద వస్తున్న మిక్డ్స్ రియాక్షన్స్ వల్ల విజువల్ పరంగా మరిన్ని అదనపు హంగులను కలపాల్సొస్తుంది. ఇక జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలొచ్చాయి కూడా.
కానీ ఆ సినిమా తీయడానికి తనకింకా అనుభవం కావాలనీ, ఏదో ఓ రోజు కచ్చితంగా తెరకెక్కిస్తానని రాజమౌళి కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. మరి దిల్ రాజు ప్రకటించిన ఈ చిత్రాలు ఎప్పుడు సెట్స్ పైకెళ్తాయో? ఎలాంటి అవుట్ పుట్ తో ఆడియెన్సును అలరిస్తాయో చూడాలి మరి?