Icon : ఐకాన్‌పై దిల్ రాజు క్లారిటి..!

Icon : ఐకాన్ టైటిల్‌తో అల్లు అర్జున్ ఎప్పుడో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. రీసెంట్‌గా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో టాలీవుడ్ నిర్మాతల, హీరోల దృష్ఠి తనపై పడింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ గా నిలిచిన ‘పింక్’ రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి వకీల్ సాబ్ సినిమా తీసి ప్రతీ ఒక్కరిని మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న ఆసక్తి అందరిలో మొదలైంది.

dil raju gave clarity regarding icon....!
dil raju gave clarity regarding icon….!

అయితే అతను చేయాల్సిన ఐకాన్ ..నెక్స్ట్ పట్టాలెక్కే సినిమా అని మాత్రం ప్రచారమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇన్ని నెలలుగా హోల్డ్‌లో ఉన్న ‘ఐకాన్ – కనబడుటలేదు’ సినిమా మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తుండటంతో పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ మొదలు పెట్టారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ‘ఐకాన్’ సినిమాపై వేణు స్పందించాడు. ‘వకీల్ సాబ్’ విడుదల తర్వాత ‘ఐకాన్’ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారనే వార్తలను నిజం చేస్తూ.. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు.

Icon : ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ‘ఐకాన్’ ..!

దిల్ రాజు.. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ తో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొని మేము వెంటనే చేయబోయే సినిమా ‘ఐకాన్’ అని వెల్లడించారు. మా కాంబినేషన్‌లో ‘ఇమిడియేట్ గా చేసే సినిమా ‘ఐకాన్’నే. నా మనసుకు నచ్చిన కథ. వేణు లైన్ చెప్పినప్పటించే ట్రావెల్ అవుతున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. త్వరలోనే ‘ఐకాన్’ స్టార్ట్ చేస్తాం’.. అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా ‘ఐకాన్’ అని క్లారిటీ వచ్చేసింది.

Advertisement