Dil Raju : దిల్ రాజు రియల్‌ ‘వారసుడు’ వచ్చాడు చూశారా?

NQ Staff - March 10, 2023 / 09:01 PM IST

Dil Raju  : దిల్ రాజు రియల్‌ ‘వారసుడు’ వచ్చాడు చూశారా?

Dil Raju  : మొన్న సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘వారసుడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దిల్ రాజుకు భారీ లాభాలు వచ్చాయి. తెలుగు లో కాస్త తక్కువ వసూళ్లు రాబట్టినా కూడా తమిళంలో మాత్రం భారీగా వసూళ్లు సాధించింది.

దిల్‌ రాజు సంక్రాంతికి తన రీల్ వారసుడు ను తీసుకు వచ్చాడు. తాజాగా తన రియల్‌ వారసుడు అన్వై రెడ్డి ని పరిచయం చేశాడు. కరోనా సమయంలో తేజస్విని ని వివాహం చేసుకున్న దిల్ రాజు ఇటీవల తండ్రి అయిన విషయం తెల్సిందే. తాజాగా దిల్ రాజు తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అన్వై రెడ్డి తల నీలాలు సమర్పించిన దిల్ రాజు దంపతులు ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపం లో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్న దిల్ రాజు కుటుంబ సభ్యులు ఆ తర్వాత మాడ వీదుల్లో నడుస్తున్న సమయంలో మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో అన్వై రెడ్డి ఫొటోలు విజువల్స్ ను తీసేందుకు మీడియా వారు ప్రయత్నించారు.

దిల్ రాజు వారసుడు చాలా క్యూట్ గా ఉన్నాడని.. చూస్తూ ఉంటే భవిష్యత్తులో హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అన్వై రెడ్డి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us