గుణశేఖర్ శాకుంతలం సినిమాకి సమంత ని ఒప్పించిన దిల్ రాజు.. స్కెచ్ చాలా పెద్దదే ..?
Vedha - January 4, 2021 / 12:55 PM IST

గుణశేఖర్ తెరకెక్కించబోతున్న శాకుంతలం సినిమాకి సమంత నటించబోతుందని రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసందే. గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక్క సమంత పేరు తప్ప అనుష్క శెట్టి దగ్గర నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ వరకు చాలా మంది పేర్లు ప్రచారంలో నిలిచారు. వీరిలో ఎక్కువగా వినిపించింది అనుష్క శెట్టి, పూజా హెగ్డే పేర్లు మార్మోగిపోయాయి. అయితే అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో అనుష్క ఈ సినిమాకి మైనస్ అవుతుందనా లేక ఇంకేదైనా కారణమా తెలీదు గాని అనుష్క తో రుద్రమదేవీ చేసిన గుణశేఖర్ శాకుంతలం లో మాత్రం అనుష్క ని పక్కన పెట్టాడట.
ఇక పూజా హెగ్డే ని రెమ్యూనరేషన్ పరంగా కాదనుకున్నట్టు సమాచారం. అయితే ఏ ఒక్కరు ఊహించనిది మాత్రం శాకుంతలం గా సమంత ని గుణశేఖర్ సెలెక్ట్ చేసుకుంటాడని. అనౌన్స్ మెంట్ వచ్చినా కూడా హీరోయిన్ ని సస్పెన్స్ లో పెట్టడంతో ఏ ఒక్కరు ఖచ్చితంగా హీరోయిన్ ని మాత్రం గెస్ చేయలేపోయారు. ఇక సమంత ని అనౌన్స్ చేయగానే చాలామంది షాక్ కి గురయ్యారు. అయితే గుణశేఖర్ తన శాకుంతలం సినిమాకి సమంత ని తీసుకోవడానికి కారణం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారట.
ప్రస్తుతం దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ తో ఒక ప్రాజెక్ట్ నిర్మించబోతున్నాడు. అలాగే విక్రం కుమార్ – నాగ చైతన్య తో థాంక్యూ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే భారీ ప్రాజెక్ట్ మాత్రం దిల్ రాజు కి సెట్ అవడం లేదట. అందుకే గుణశేఖర్ తెరకెక్కించబోతున్న శాకుంతలం సినిమా కథ తెలుసుకొని ఆ సినిమా కథ విపరీతంగా నచ్చడం తో శాకుంతలంగా సమంత ని ఒప్పించాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాని గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థ లో నిర్మిస్తుండగా దిల్ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని .. త్వరలో అఫీషియల్ గా దిల్ రాజు ని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.