Dil Raju : చిరు, బాలయ్యలు ఊరుకుంటారా… దిల్ రాజుపై యాక్షన్‌ ఉంటుందా?

NQ Staff - November 9, 2022 / 11:46 AM IST

Dil Raju : చిరు, బాలయ్యలు ఊరుకుంటారా… దిల్ రాజుపై యాక్షన్‌ ఉంటుందా?

Dil Raju : వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన నటిస్తున్న వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాల థియేటర్ల విషయంలో పోటీ ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఏ హీరో సినిమా ఎక్కువ థియేటర్లో విడుదల అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఈ సమయంలో దిల్ రాజు సాధ్యమైన అన్ని ఎక్కువ థియేటర్స్ ని తన హోం బ్యానర్ లో నిర్మిస్తున్న విజయ్ వారసుడు సినిమా కోసం బుక్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

వారసుడు సినిమా తో పోలిస్తే వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలకు తక్కువ థియేటర్స్ దక్కబోతున్నాయి అంటూ సమాచారం అందుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక డబ్బింగ్ సినిమా ను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు గాను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

ఒకవైపు చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు ఉన్నా కూడా డబ్బింగ్ సినిమాలో ఈ స్థాయిలో విడుదల చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తమ సినిమాలకు థియేటర్స్ ఇవ్వకపోతే చిరంజీవి మరియు బాలకృష్ణ ఊరుకుంటారా… దిల్ రాజు పై యాక్షన్ తీసుకుంటారా అనేది చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us