Digangana Suryavanshi : సినిమాల‌తో బిజీ.. డిగ్రీ పూర్తి చేయ‌డానికి ఐదేళ్లు తీసుకున్న హీరోయిన్

Digangana Suryavanshi : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ సరసన హిప్పీ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ‌ దిగంగన సూర్యవంశి. చూడ‌డానికి చాలా క్యూట్‌గా హాట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో పలు సీరియళ్లలో నటించింది. ‘ఏక్ వీర్ కి అర్దాస్ … వీరా’తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్‌బాస్‌-9లోకి వెళ్లింది.

digangana suryavanshi study and career
digangana suryavanshi study and career

తెలుగులో యువహీరో కార్తికేయతో కలిసి ‘హిప్పీ’సినిమాలో న‌టించిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా గోపిచంద్‌ హీరోగా న‌టించిన సీటీమార్‌ చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవ‌ల ఈ అమ్మ‌డుఇపై నెమలి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

digangana suryavanshi study and career
digangana suryavanshi study and career

హీరోయిన్ దిగంగన సూర్యవంశి.. ఒక అందమైన నెమలి దగ్గరకు వెళ్లింది. దానిని చూస్తూ అక్కడే నిల్చోని నవ్వుతూ.. దానికి మరింత దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించింది. మెల్లిగా నడుస్తున్న నెమలి ఒక్కసారిగా ఆమె పైకి ఎగిరి పొడిచింది. దీంతో దిగంగన గట్టిగా అరుస్తూ.. చేతులతో నెమలిని తోసేసింది.

దిగంగ‌న భామ యాక్టింగ్‌లోకాదు అకాడ‌మిక్ స్ట‌డీస్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీ ఇటీవ‌లే త‌న బీఏ డిగ్రీని పూర్తి చేసింది. అయితే మూడేళ్ల‌లో పూర్తి చేయాల్సిన డిగ్రీకి దిగంగ‌నా ప్రొఫెష‌న‌ల్ క‌మిట్ మెంట్స్ వ‌ల్ల 5 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది. ఇటీవ‌లే త‌న‌కిష్ట‌మైన ఎంబీఏ ప్రోగ్రామ్ లో చేరింది దిగంగ‌నా. చిన్ననాటి నుంచి తాను మంచి విద్యార్థిని అని తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది దిగంగ‌నా.

ఏడేళ్ల వ‌య‌స్సు నుంచి ఓ వైపు స్ట‌డీస్‌ను, మ‌రోవైపు వృత్తిప‌ర‌మైన క‌మిట్‌మెంట్స్ ను బ్యాలెన్సింగ్ చేస్తూ విజ‌యవంతంగా ముందుకెళ్తున్నాన‌ని చెప్పింది. దిగంగ‌నా సూర్య‌వంశి ప్ర‌స్తుతం బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు ది బాటిల్ ఆఫ్ భీమా కోరెగావ్, డార్క్ పాత్‌ సినిమాల్లో న‌టిస్తుంది.