అనిల్ రావిపూడి కోసం వెంకీ నారప్ప నుంచి బయటకి వచ్చినట్టేనా ..?

తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ తెలుగు రీమేక్ ‘నారప్ప’ లో విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రియమణి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తుండగా సెకండ్ హీరోయిన్ గా మలయాళ నటి రెబ్బ మోనిక జాన్ కనిపించనుంది.

Victory Venkatesh's Asuran Telugu Remake Narappa Movie First Look HD  Posters - Social News XYZ

కాగా ఈ సినిమా కి సంబంధించి వెనకటేష్ పాల్గొనాల్సిన సీన్స్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం. వాస్తవంగా క్లైమాక్స్ లో వందమంది వరకు జూనియర్ ఆర్టిస్ట్ లు అవసరం అవుతారని.. అయితే వారికి సంబంధించిన షాట్స్ ను మాత్రం పక్కన పెట్టి వెంకీ మీద తీయాల్సిన షాట్స్ మొత్తం ఫినిష్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా వెంకీ కమిటయిన ప్రాజెక్ట్స్ పెండింగ్ లో పడగా ఇప్పుడు వరసగా సినిమాలని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట.

ఈ క్రమంలోనే డిసెంబర్ 14 నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎఫ్ 3 లో నటించబోతున్నాడు. అందుకే వీలైనంత త్వరగా నారప్ప కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతోనే ముందు నారప్ప లో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి బయటపడ్డాడని సమాచారం. ప్రస్తుతం ఎఫ్ 3 కి సిద్దం కాబోతున్నాడట వెంకీ. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వెంకీ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Advertisement