MS Dhoni: మ‌హేంద్రుడి దూకుడు.. ఇప్ప‌టికీ భారీగా సంపాదిస్తున్న ధోని

MS Dhoni: మాజీ టీమిండియా ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ బుధవారం త‌న 40వ బ‌ర్త్‌డే జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ధోని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్రమ‌ఖులు, రాజ‌కీయ నాయ‌కులు,క్రీడా ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ధోనికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.అంతేకాక ఆయ‌న చాటిన ఘ‌న‌త‌ల‌ను మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

MS Dhoni

భారత క్రికెట్ జ‌ట్టుకు ఆడుతున్న సమయంలో.. టీమిండియాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన జార్ఖండ్ డైనమేట్.. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతున్నాడు. అయితే నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరుకున్న ధోని ఇక క్రికెట్‌కు గుడ్ బై చెప్పి బిజినెస్ వ్య‌వ‌హ‌రాలు చూసుకుంటాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది.

ఈ క్ర‌మంలో చైన్నై టీం మేనేజ్‌మెంట్ స్పందించింది. మా కెప్టెన్ ధోనీనే అని ప్రకటించింది. మరో రెండేళ్లు సీఎస్కే సారథ్య బాధ్యతలు ధోనీనే చూసుకుంటాడని పేర్కొంది. అంటే రెండేళ్ల పాటు ధోని క్రికెట్‌ని ప్రేక్ష‌కులు మ‌స్త్‌గా ఎంజాయ్ చేయోచ్చు. అయితే ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూర‌మైన అత‌డి సంపాద‌న మాత్రం త‌ర‌గ‌డం లేదు. టీవీ కమర్షియల్స్ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్, రేసింగ్ కార్ల వరకు పలు వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డంతో అవి అంత‌కంత పెరుగుతూ పోతున్నాయి.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 826 కోట్లు. ధోనీ పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నాడు. టీవీ, ప్రింట్, వెబ్ ప్రకటనల్లో తరచుగా కనిపించే ధోనీ.. ఈ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయల వెనకేసుకుంటున్నాడు.

ఐపీఎల్ ద్వారా ధోని ఏడాదికి 15 కోట్లు సంపాదిస్తుంటాడు. అలానే మహీ ప్ర‌తి యాడ్‌కి 1-3 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. ప్రస్తుతం మహీ ఖాతాలో అటుఇటుగా 15 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి. ఇక జ‌ట్టులో ఉన్న‌ప్పుడు అత‌ను ఏ ప్ల‌స్ క్యాట‌గిరీలోఉన్నందుకు బీసీసీఐ అత‌డికి 7 కోట్లు చెల్లించేంది. మొత్తంగా ఆయ‌న వార్షిక ఆదాయం 50 కోట్ల పైనే ఉండేది.

2021 వరకు ధోనీ ఐపీఎల్‌ లీగ్‌ ద్వారా రూ.150 కోట్ల ఆదాయం పొందినట్టు సమాచారం. ఎంఎస్ ధోనీ తన వద్ద ఉండే డబ్బును ఇతర స్పోర్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు. ఈయన ఫుట్‌బాల్ క్లబ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ టీమ్ ఓనర్. ధోనీకి ఫుట్‌బాల్ అన్నా చాలా ఇష్టమనే విషయం మనకు తెలిసిందే. బైక్స్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే ధోని అనేక రకాల బైకులు క‌లిగి ఉన్నాడు. వాటితో పాటు కార్లు కూడా ఉన్నాయ‌నుకోండి.

స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ధోనీకి కంపెనీ కూడా ఉంది. దీని కింద దేశవ్యాప్తంగా 200 జిమ్‌లు ఉన్నాయి. అలానే ఝార్ఖండ్‌లో హోటల్ మహి రెసిడెన్సీ పేరుతో పెద్ద హోటల్ ఉంది. ఇలా అనేక ర‌కాలుగా ధోని బాగానే సంపాదిస్తున్నారు. 2014, 15లో ఫోర్ట్స్ టాప్ 100 అథ్లెట్స్ జాబితాలో స్థానం పొందిన ఒకే ఒక ఇండియన్ ధోనీ.