రష్మీని పొగిడారా? పరువు తీశారా?.. వీడియో వైరల్
NQ Staff - December 26, 2020 / 05:21 PM IST

ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ గౌతమ్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో రష్మీ మాత్రం బుల్లితెర కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో రష్మీ మూగజీవాల కోసం రోడ్డు మీదకు వచ్చి ఎంతో కష్టపడింది. వీధి కుక్కలకు సరిగ్గా ఆహారం దొరకడం లేదంటూ రష్మీ నేరుగా రంగంలోకి దూకింది. బకెట్ పట్టుకుని కుక్కలను ఫుడ్ పెడుతూ మానవత్త్వాన్ని చాటుకుంది.
ఎక్కడ ఏ మూగ జీవానికి సమస్య వచ్చిందని తెలిసినా వెంటనే స్పందించింది. ఇన్ స్టాలో లైవ్‌లోకి వచ్చి మరీ మాట్లాడింది. ఈ ఏడాది మొత్తంలో రష్మి సోషల్ మీడియాలో లైవ్‌లోనే ఎక్కువగా కనిపించింది. నెటిజన్లతో మాట్లాడటం, మూగ జీవాల సంరక్షణ కోసం సలహాలు, సూచనలు చెప్పుకొచ్చింది. అయితే ఇదే టాపిక్ మీద తాజాగా స్కిట్ చేశారు. ఎక్స్ ట్రా జబర్దస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. అందులో కొత్త ఏడాది, పాత ఏడాది అంటూ తేడా చెబుతూ స్కిట్ చేశారు.
ఇందులో యోధ రోజాగా నటించింది. 2020లో రోజా, 2021లో ఉండబోయే రోజాకు తేడా చూపించారు. 2020లో రోజా జిమ్ చేస్తూ ఉన్నట్టుగా యోద చూపించింది. ఇక రష్మీ పాత్రలో దమ్ము దీవెన అదరగొట్టేసింది. చెరిగిన జట్టుతో చీపురు పట్టుకుని ఎంట్రీ ఇచ్చింది. ఇక అభిమానులతో లైవ్‌లో మాట్లాడుతూ తాను రష్మీనే మేకప్ లేదని గుర్తు పట్టడం లేదా అంటూ దీవెన కౌంటర్ వేసింది. అంటే రష్మీ సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉందని పొగిడారా?లేదా మేకప్ లేకపోతే రష్మీని ఎవ్వరూ గుర్తు పట్టరని పరువుతీశారో తెలియడం లేదు.