Dancer Pandu : వెళ్లి పోయిన ప్రియురాలిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకున్న నక్కిలీసు గొలుసు పండు

NQ Staff - September 29, 2022 / 08:30 AM IST

Dancer Pandu : వెళ్లి పోయిన ప్రియురాలిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకున్న నక్కిలీసు గొలుసు పండు

Dancer Pandu : ఢీ డాన్స్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న డాన్సర్స్ లో పండు ఒకరు. ముఖ్యంగా నాది నక్లిస్ గొలుసు అనే పాటలో అమ్మాయిగా కాస్ట్యూమ్స్ ధరించి కనిపించి డాన్స్ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కేవలం డాన్సర్ గా మాత్రమే కాకుండా జబర్దస్త్ లో కమెడియన్ గా కూడా తన సత్తా చాటిన పండు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు.తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న పండు తన యొక్క రియల్ లైఫ్ సంఘటనలను చెప్పి ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించాడు.

తన తల్లి చిన్నతనంలోనే చనిపోయిందని, తల్లి చనిపోయిన బాధ నుండి కోలుకునే విధంగా తనకు ఒక ప్రియురాలు దక్కిందని.. ఆమె తల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునేదని.. అమ్మ లేని లోటు నాకు తీరుతుందని అనిపించింది.. కానీ ఆ దేవుడు నా నుండి అమ్మని తీసుకు వెళ్లినట్లుగానే ఆ అమ్మాయిని కూడా తీసుకు వెళ్లాడు. నా కంటే ఎక్కువ బాగా చూసుకుంటుందని మా అమ్మ ఆ అమ్మాయిని తీసుకు వెళ్లిందేమో అంటూ పండు కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న అందరిని కదిలించడంతో పాటు టీవీలో చూస్తున్న ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు తెప్పించాడు.

ఎప్పుడు సరదాగా కామెడీ చేస్తూ డాన్స్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్సర్ పండు జీవితం వెనుక ఇంత విషాదం ఉందని ఏ ఒక్కరు ఊహించలేదు. అతడి యొక్క జీవితం అంత సులభంగా ఏమీ లేదని అయినా కూడా జీవితంలో ముందుకు వెళ్లాలి సక్సెస్ అవ్వాలి అనే పట్టుదలతో దుఃఖం దిగమింగుకుంటూ అందరిని నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్న పండు నిజంగా గ్రేట్. అతడు ఎంతో మందికి ఆదర్శమనడంలో సందేహం లేదు, ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా జీవితం సవాళ్లను ఇచ్చినా వాటిని ఎదుర్కొని సక్సెస్ వైపుగా వెళ్లాలి అనేది పండు యొక్క జీవితం చూసి నేర్చుకోవాలి. పండు నీ జీవితంలో మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము అంటూ సోషల్ మీడియాలో లక్షల మంది అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us