Dhee : ఢీ సెట్ గుట్టు విప్పేశారు.. శేఖర్ మాస్టర్, ప్రదీప్ కామెంట్స్ వైరల్

NQ Staff - February 1, 2021 / 07:22 PM IST

Dhee : ఢీ సెట్ గుట్టు విప్పేశారు.. శేఖర్ మాస్టర్, ప్రదీప్ కామెంట్స్ వైరల్

Dhee : ఢీ షోలో ప్రదీప్, శేఖర్ మాస్టర్, ప్రియమణి, రష్మీ, ఆది, సుధీర్ ఇలా అందరూ కలిసి ఎంత జాలీగా సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. అయితే మనకు తెరపై మాత్రం వారి అల్లరి కనిపిస్తుంటుంది. కానీ తెర వెనుక మాత్రం మనకు తెలియనివెన్నో జరుగుతుంటాయి. వచ్చే ఎపిసోడ్‌ గంట అయినా కూడా షూటింగ్‌ మాత్రం రోజంతా జరగుతూ ఉంటుంది. నెలంతా సరిపోయే ఎపిసోడ్‌లను రెండు మూడు రోజులు కంటిన్యూగా షూట్ చేస్తారట. ఇలా ఎన్నో విషయాలను తాజాగా బయటపెట్టేశారు.

తాజాగా శేఖర్ మాస్టర్‌ను ఆయన కూతురు సాహితి ఇంటర్వ్యూ చేసింది. అయితే అందులో మాట్లాడిన అంశాలను బట్టి చూస్తే ఆ ఇంటర్వ్యూ లాక్డౌన్ కాలంలో చేసినట్టు అర్థమవుతోంది. అయితే సాహితి చేసిన ఈ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ఎన్నో విషయాలను బయటపెట్టేశాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను బయటపెట్టేశాడు. చిన్నప్పుడు చదువుకున్న స్కూల్, నాటి విషయాలన్నంటిని చెప్పుకొచ్చాడు. అదే క్రమంలో ఢీ షో గురించి కూడా కామెంట్ చేశాడు.

ఢీ షోకు సంబంధించిన ఎపిసోడ్‌లు అన్నీ కూడా ఒకే సారి షూట్ చేస్తామని, నెలకు ఓ సారి ఎప్పుడో లాంగ్ షెడ్యూల్ చేస్తామని అలా ఒక్కోసారి కంటిన్యూగా రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తూనే ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రొఫెషనల్‌గా ఉంటామని, సాంగ్ సాంగ్‌కు మధ్యలో గ్యాప్ ఉంటుందని, అలా మధ్యలో తామంతా కలిసి ముచ్చట్లు పెడతామని, ఫ్యామిలీలా కలిసి ఉంటామని చెప్పుకొచ్చాడు.

అయితే శేఖర్ మాస్టర్ చెప్పింది నిజమా? కాదా? అని ప్రదీప్‌కి ఫోన్ చేసింది సాహితి. ప్రదీప్ కూడా అదే విషయాన్ని చెప్పాడు. తామంతా ఫ్యామిలీలా ఉంటామని, అందరం కలిస్తే పండుగ వాతావరణం ఉంటుందని, అలా షూటింగ్‌లు ముగిశాక తరువాతి షెడ్యుల్ చాలా రోజుల తరువాత ఉందని తెలిస్తే అందరం కలిసి పార్టీలు చేసుకుంటామని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us