Vijay Thalapathy : సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొత్త మార్పులు.. విజ‌య్‌కి విల‌న్‌గా మ‌రో స్టార్ హీరో

NQ Staff - June 16, 2022 / 06:47 PM IST

Vijay Thalapathy : సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొత్త మార్పులు.. విజ‌య్‌కి విల‌న్‌గా మ‌రో స్టార్ హీరో

 

Vijay Thalapathy : సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొత్త మార్పులు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు సోలోగా న‌టించేందుకు చాలా మంది ఉత్సాహం చూపించేవారు. ఇప్పుడ‌లా కాదు క‌లిసి ప‌ని చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేయ‌గా, ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించింది. ఇక ఎఫ్ 3 చిత్రంతో పాటు విక్ర‌మ్ ఇలా ప‌లు మ‌ల్టీ స్టార‌ర్స్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.

క్రేజీ కాంబినేష‌న్స్..

dhanush and vijay

 

మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌న కొత్త సినిమాలో విజయ్ కు పోటీగా మరో హీరోను రంగంలోకి దింపబోతున్నాడట. లోకేష్‌ సినిమాల్లో ఇద్దరు హీరోలు అనేది కామన్‌ అయిపోయింది. మాస్టర్ లో విజయ్ హీరోగా నటిస్తే, విజయ్‌సేతుపతి విలన్ రోల్ చేశాడు. విక్రమ్ లో కమల్ హీరో, మళ్లీ విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు.

 

ఇప్పుడు విజయ్ నటించే కొత్త చిత్రంలో కూడా స్టార్‌ హీరో ధనుష్‌ని విలన్‌గా చూపించబోతున్నాడట. ఇప్పటికే ధనుష్‌కు కథ వినిపించాడట. ఆయనకు పాత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెరపై ‘మాస్టర్’ వర్సెస్ ‘మారి’ ఫైట్ చూడొచ్చు.

dhanush and vijay

dhanush and vijay

లోకేష్ తెర‌కెక్కించిన విక్ర‌మ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. 12వ రోజూ ‘విక్రమ్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 32 లక్షలు షేర్, రూ. 0.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

 

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో రూ. 14.18 కోట్లు కొల్లగొట్టిన ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఈ దెబ్బతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌, హిందీ సహా తమిళనాడులో కలిపి ఈ సినిమా 12 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.161.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 323.01 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 110 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లు పెట్టి కొన్నాడు. తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. ఇప్పటికే రూ. 14.18 కోట్లు రావడంతో ఇప్పటికే సినిమాకు రూ. 6.68 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us