Devi sri prasad: సుకుమార్ బ‌ర్త్ డే.. స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన దేవి శ్రీ

Devi sri prasad: లెక్క‌ల మాస్టారు సుకుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం అనే సినిమాతో భారీ హిట్ కొట్టిన సుకుమార్ రీసెంట్‌గా పుష్ప అనే చిత్రంతో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకున్నాడు. రెండు పార్ట్‌లుగా ఈ సినిమాని ప్లాన్ చేయగా, తొలి పార్ట్ రీసెంట్‌గా విడ‌దలై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులో క‌న్నా ఈ చిత్రం హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

devi sri surpirse to sukumar birthday
devi sri surpirse to sukumar birthday

పుష్ప సినిమాతో సుకుమార్ కూడా ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా సరికొత్త క్రేజ్ ను అందుకున్నాడు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే నేడు సుకుమార్ బర్త్ డే కావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ తరుణంలో సుకుమార్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు. సుకుమార్ ఎంతో సపోర్ట్ గా ఉండే ఆయన భార్య తబితా సుకుమార్ ఒక సరికొత్త సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చారు. నా ప్రేమకు పుట్టిన రోజు శభాకాంక్షలు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోటోలు పోస్ట్ చేస్తూ ప్రత్యేకంగా తన ప్రేమను చాటుకున్నారు. నేను రోజంతా విశ్వానికి చాలా థాంక్స్ చెప్పాలి, ప్రతిరోజూ మీ కోసం ఎంతో ఆనందిస్తాను.

మీ ప్రియమైన వారి జీవితాల్లోకి తీసుకువచ్చే మొత్తం ఆనందం ఈ రోజు. ఈ సంవత్సరం చాలా ఉత్తేజకరమైన విషయాలతో నిండి ఉంటుంది. లవ్ యు.. అంటూ ఈ ఏడాది కూడా మంచి బ్లెస్సింగ్స్ తో పాటు అడ్వెంచరస్ గా ఉండాలని తాబితా కోరుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చారు. ఇక సుకుమార్ కూతురు కొడుకు ఇద్దరు కూడా ఈ పుట్టిన రోజు వేడుకల్లో చాలా ఆనందంగా గడిపినట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన ఫోటోలను కూడా తబితా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇక సుకుమార్ ఫిబ్ర‌వరి నుండి పుష్ప పార్ట్ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ వ‌ర్క్‌ని ఇప్ప‌టికే పూర్తి చేసిన సుక్కూ వీలైనంత త్వ‌ర‌గా చిత్ర షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడు.