మ్యాచ్ కు ముందే ఢిల్లీకి భారీ షాక్

Advertisement

ఐపీల్ 2020 నిన్న మొదలైన విషయం తెలిసిందే. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై, చెన్నై జట్లు తలపడి చెన్నై జట్టు విజయం సాధించింది. ఇది ఇలా ఉంటె నేడు ఢిల్లీ, పంజాబ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టుకు ఊహించని సమస్య వచ్చిపడింది. అయితే ఈ జట్టు లో పేస్ విభాగాన్ని కగిసో రబడా, భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చూసుకుంటాడు. కానీ నిన్న రాత్రి ప్రాక్టీస్ సమయంలో ఇషాంత్ శర్మ వీపుకు గాయమైందని సమాచారం.

దీనితో ఈరోజు జరిగే మ్యాచ్ లో ఇషాంత్ ఆడేటట్లు లేడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ టీం కి చెందిన ఒక వ్యక్తి తెలిపిన సమాచారం ప్రకారం ఇషాంత్ కు గాయం అయిందని తెలిపాడు. ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయం వరకు తాను ఆడుతాడో లేదో అని విషయాన్ని వైద్యులు తెలుపుతారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here