Deepthi Sunaina: మరీ ఇంత ఓవ‌రాక్ష‌నా.. ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీకి కూడా ఇలా భ‌య‌ప‌డ‌రేమో!

Deepthi Sunaina: క‌రోనా మ‌హ‌మ‌మ్మారి బుస‌లు కొడుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల సూచ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌తి ఒక్క‌రు ఫొటోలు లేదా వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇక సెల‌బ్రిటీల సంగ‌తైతే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Deepthi Sunaina

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సెల‌బ్స్ త‌ప్పని స‌రిగా ఆ స‌మ‌యంలో దిగిన ఫొటోనో లేదంటే వీడియోనో త‌మ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని చెబుతున్నారు. అయితే కొంద‌రు సెల‌బ్స్ వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో ఇచ్చే హావ‌భావాలు మ‌రీ టూమ‌చ్ అనిపిస్తున్నాయి. కొంద‌రు భామ‌లు ఏదో స‌ర్జరీ చేస్తున్న‌ట్టు హ‌డావిడి చేస్తుండ‌డంతో దానిపై న‌టీమ‌ణులు ఫైర్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన దీప్తి సునయన ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మ‌డు త‌న టాలెంట్‌తో బిగ్ బాస్ ఆఫ‌ర్ అందుకుంది. అలానే షణ్ముఖ‌తో ప్రేమాయ‌ణంకి సంబంధించి ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. ఇక శివ‌జ్యోతి యాంక‌ర్‌గానే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అంద‌రికి సుప‌రిచితం. సావిత్రిగా ఫేమ‌స్ అయిన శివ‌జ్యోతి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లి ఏడుపుతో విసుగు తెప్పించింది.

తాజాగా వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో దీప్తి సున‌య‌న‌, శివ జ్యోతి చేసిన ఓవార‌క్ష‌న్ చూసి నెటిజ‌న్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. దీప్తి సున‌య‌న వ్యాక్సిన్ వేయించుకునే స‌మ‌యంలో సూది చూసి తెగ భ‌య‌ప‌డింది. ఏదో ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేస్తే ఎంత భ‌య‌ప‌డ‌తారో ఆ రేంజ్‌లో ఈమె ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీన్‌లోకి వచ్చి సావిత్రి.. అదే నండి మన శివజ్యోతి.. ‘ఏడుస్తారా ఎవరైనా.. దీని చేతులు చల్లబడిపోయాయి పాపం.. బుజ్జితల్లీ అయిపోయింది.. తెగ యాక్టింగ్ చేసేసింది.

కుక్క పిల్ల‌లా దీప్తి సున‌య‌న అరుస్తుంటే శివ జ్యోతి ఓదార్చ‌డం చూసిన వారు వీళ్ల ప‌ర్‌ఫార్మెన్స్ కు ఆస్కార్ అవార్డ్ కూడా స‌రిపోదేమో. భాస్క‌ర్ అవార్డ్ క‌రెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు ఓ రేంజ్‌లో వీరిని ఏకిపారేయడంతో ఈ వీడియోను వెంటనే డిలీట్ చేసేంది సునయన. కాని అప్ప‌టికే వీడియో యూట్యూబ్‌లోకి అప్ లోడ్ అయిపోయింది . దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతుంది.