Deepthi: వ్యాక్సిన్‌కి అంత వ‌ణికిన బిగ్ బాస్ బ్యూటీ టాటూ నొప్పిని బాగానే భ‌రించిందే..!

Deepthi: వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌ల ద్వారా ఎంతో మంది స్టార్లుగా మారారు. అందులోంచి కొంత మంది బిగ్ బాస్ షోలోకి వచ్చారు. అలా దీప్తి సునయన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ ద‌క్కించుకుంది మ‌రోవైపు షణ్ముఖ్‌తో ప్రేమ‌ వ్యవహారంతో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.

దీప్తి సునయన, షణ్ముఖ్ మధ్య ప్రేమ నడుస్తోందంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ రూమర్లు వారిద్దరూ ఎప్పుడూ కూడా ఖండించలేదు. అలా అని తామిద్దరం ప్రేమలో ఉన్నట్టు ఎప్పుడూ కూడా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరి పోస్ట్‌లు, వ్యవహారాలు చూస్తుంటే మాత్రం ప్రేమలో ఉన్నారనే సంకేతాలు మాత్రం వెళుతుంటాయి.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సినేష‌న్ స‌మ‌యంలో దీప్తి సున‌య‌న‌, శివ జ్యోతి చేసిన ఓవార‌క్ష‌న్ చూసి నెటిజ‌న్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేసారు. దీప్తి సున‌య‌న వ్యాక్సిన్ వేయించుకునే స‌మ‌యంలో సూది చూసి తెగ భ‌య‌ప‌డింది. ఏదో ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేస్తే ఎంత భ‌య‌ప‌డ‌తారో ఆ రేంజ్‌లో ఈమె ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సీన్‌లోకి వచ్చి సావిత్రి.. అదే నండి మన శివజ్యోతి.. ‘ఏడుస్తారా ఎవరైనా.. దీని చేతులు చల్లబడిపోయాయి పాపం.. బుజ్జితల్లీ అయిపోయింది.. తెగ యాక్టింగ్ చేసేసింది.

కుక్క పిల్ల‌లా దీప్తి సున‌య‌న అరుస్తుంటే శివ జ్యోతి ఓదార్చ‌డం చూసిన వారు వీళ్ల ప‌ర్‌ఫార్మెన్స్ కు ఆస్కార్ అవార్డ్ కూడా స‌రిపోదేమో. భాస్క‌ర్ అవార్డ్ క‌రెక్ట్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు ఓ రేంజ్‌లో వీరిని ఏకిపారేయడంతో ఈ వీడియోను వెంటనే డిలీట్ చేసేంది సునయన. కాని అప్ప‌టికే వీడియో యూట్యూబ్‌లోకి అప్ లోడ్ అయిపోయింది . దీంతో ఈ వీడియో తెగ వైర‌ల్ అయింది.

తాజాగా దీప్తి సున‌య‌న టాటూ వేయించుకోగా, అందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. వ్యాక్సిన్ స‌మ‌యంలో బాగా భ‌య‌ప‌డ్డ‌ట్టు న‌టించిన దీప్తి టాటూ వేయించుకునేటప్పుడు మాత్రం కాస్త న‌వ్వుకుంటూ కాస్త బాధ‌ప‌డ్డ‌ట్టు ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. దీప్తి టాటూ అర్ధం ఏంటో తెలియాల్సి ఉంది.