Deepthi Sunaina: అన్ని గిఫ్ట్స్‌లో అదే.. విషయం బయటపెట్టేసిన దీప్తి సునయన

Deepthi Sunaina about Shanmukh
Deepthi Sunaina about Shanmukh

Deepthi Sunaina దీప్తి సునయన షణ్ముఖ్ జోడి గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. బిగ్ బాస్ షోలో దీప్తి సునయన వెళ్లక ముందు ఈ జంట బాగా ఫేమస్. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్ అంటూ దీప్తి సునయన షణ్ముఖ్‌లు సోషల్ మీడియాను ఊపేసేవారు. ఇక బిగ్ బాస్ షోలోకి దీప్తి రావడంతో మరింత వెలుగులోకి వచ్చింది ఈ జంట.

దీప్తి సునయన బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్‌ను తలుచుకుని ఎన్నో సార్లు ఏడ్చేసింది. తనీష్‌తో ఏకాంతంగా ముచ్చట్లు పెడుతున్న సమయంలోనూ షణ్ముఖ్ గురించి మాట్లాడుకొచ్చింది. ఇక ఓ సారి టాస్క్‌లో భాగంగా కౌశల్‌ను గెలకడంతో అతను కూడా షణ్ముఖ్ టాపిక్ తీసి ఏడిపించేశాడు. ఆ సమయంలో ఆ టాపిక్ బాగా హైలెట్ అయింది.

అయితే ఈ మధ్య షణ్ముఖ్ కూడా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. దీప్తి సునయన కంటే ఇప్పుడు షణ్ముఖ్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతోన్నాడు. సాఫ్ట్ వేర్ డెవలవ్‌పర్ అంటూ తీసిన వెబ్ సిరీస్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను కొల్లగొట్టేసింది.

విషయం బయటపెట్టేసిన దీప్తి సునయన: Deepthi Sunaina

అయితే ఇప్పుడు షణ్ముఖ్ దీప్తి సునయనలు ఇద్దరూ కూడా రియల్ జంటలు, రీల్ జంటలు అనే షోలో పాల్గొన్నారు. స్టార్ మాలో 100 పర్సెంట్ లవ్ అంటూ రేపు రాబోతోన్న ఈ షోలో దీప్తి సునయన షణ్ముఖ్‌లు రియల్ జంటలుగా పాల్గొన్నారు. ఎప్పుడూ ప్రపోజ్ చేయాలనిపించలేదు అని షణ్ముఖ్ అంటే.. ఎందుకురా? అని దీప్తి సునయన ప్రశ్నించింది. 21 గిఫ్ట్‌లు ఇస్తే అన్నింట్లోనూ లవ్ గురించే ఉందంటూ దీప్తి సునయన అసలు విషయం చెప్పేసింది.

Advertisement