Deepthi: ష‌ణ్ముఖ్‌ని మ‌ళ్లీ క‌ల‌వాలంటే దీప్తి ఇన్ని కండీష‌న్స్ పెట్టిందా?

Deepthi: దీప్తి సున‌య‌న‌-ష‌ణ్ముఖ్ ఐదేళ్ల ప్రేమాయ‌ణానికి బిగ్ బాస్ పులిస్టాప్ పెట్టిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రం విడిపోయామ‌ని ఇప్ప‌టికే దీప్తి, ష‌ణ్ముఖ్ ప్ర‌క‌టించ‌గా తిరిగి వారు ఇరువురు క‌లిస్తే బాగుంటుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. అయితే బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్.. అక్కడ సిరితో క్లోజ్‌గా మూవ్ కావ‌డమే వారి బ్రేక‌ప్‌కి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

deepthi put condition for shanmukh
deepthi put condition for shanmukh

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో షణ్ముఖ్- దీప్తి సునైనా బ్రేకప్ వ్యవహారాన్ని బాగానే ఎక్స్ పోస్ చేస్తున్నారు.
మనం ఎలా బతుకుతున్నామని ఎవరికీ ఒక ఆలోచన ఉండదు. కానీ వేరే వాళ్ల జీవితాల్లో తొంగి చూసే నేచర్ మనుషులకు సొంతం. మన వీపు మనకు కనపడదు కానీ, ఎదుటోడి వీపుపై ఉన్న మచ్చలపై, క్యారెక్టర్‌పై ఆరోపిస్తూ ఉంటాం.

అలా సోషల్ మీడియాలో ఈ జంటపై పెద్ద రచ్చనే నడుస్తోంది. వీరిద్దరు కలుసుకోవాలని కొందరు అంటుంటే.. మరికొందరు.. షణ్ముఖ్ ఇలా చేయకపోతే బాగుండేది.. దీప్తి గేమ్‌లా చూస్తే బాగుండేదని సలహాలు ఇస్తున్నారు. అలా ఈ ఇద్దరికీ పెద్ద టాస్క్ లా మారింది. తాజాగా షణ్ముఖ్ దీప్తి సునైనాను కలవడానికి కండిషన్లు పెట్టినట్లు వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి గాసిప్స్ వింటే ఎవరికైనా చిరాకు పుట్టుకొస్తుంది.

వాస్తవానికి దీప్తి సునైనా షణ్ముఖ్ బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా బతుకుతున్నారు. కానీ నెటిజన్లకు వాళ్లు ప్రశాంతంగా బతకడం నచ్చదనుకుంటా.. అందుకే నోటికి వచ్చినట్లు రాసేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంటారు. ఎలాగైనా ఈ జంట కలవాలని అభిమానులు, స్నేహితులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కలిస్తే ఈ జంటను మళ్లీ చూడొచ్చు.

deepthi put condition for shanmukh1
deepthi put condition for shanmukh1

అయితే ఇకపై ఇలాంటి రాతలు రాయడం తగ్గించుకోవాలని, త్వరలో ఈ విషయంపై దీప్తి సునైనా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ దీప్తి.. షణ్ముఖ్‌ను కలిస్తే ఎలాంటి కండీషన్లు పెట్టనుంది. వీరి క‌ల‌యిక మ‌ళ్లీ జ‌రుగుతుందా అనే విష‌యాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.