CARONA: స్టార్ హీరోయిన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. ఫ్యామిలీ అంద‌రికి క‌రోనా పాజిటివ్

గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది క‌రోనా విజృంభ‌ణ తీవ్రంగా ఉంది. క‌రోనా కేసులు రోజుకు లెక్క‌లేన‌న్ని వ‌స్తుండ‌డంతో ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొంటున్నాయి. కుటుంబంలో ఒక్క‌రికి క‌రోనా వ‌స్తే మిగ‌తా వారు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ఫ్యామిలీ మొత్తం క‌రోనా బారిన ప‌డ‌డం అభిమానుల‌లో టెన్ష‌న్ రేకెత్తిస్తుంది. దీపికా తండ్రి, మాజీ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌దుకోన్‌, ఆమె త‌ల్లి ఉజాలా, చెల్లెలు అనీషాల‌కు క‌రోనా సోక‌గా, తండ్రిని ఆసుప‌త్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. దీపికా త‌ల్లి, చెల్లెలు ఇంట్లోనే కోలుకుంటున్నారు.

దీపికా తండ్రి ప్ర‌కాశ్ ప‌దుకోన్ ఇండియా త‌ర‌ఫున తొలిసారి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ టోర్నీ (1980లో) ఆడి గెలిచారు.1970,80లలో ఆయ‌న ఓ వెలుగు వెలిగాడు. ఇండియా త‌ర‌ఫున ప్ర‌తిష్టాత్మ‌క ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్‌షిప్ గెల‌వ‌డ‌మే కాకుండా 1983లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లోనూ బ్రాంజ్ మెడ‌ల్ కూడా గెలిచాడు. దీపికా కూడా ప‌లుమార్లు త‌న తండ్రి గొప్ప‌త‌నాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూనే ఉంటుంది. ప్రకావ్ ప‌దుకొన్‌తో పాటు మిగ‌తా వారంద‌రికి ప‌ది రోజుల కింద‌ట స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గా, టెస్ట్ చేయించుకోవ‌డంతో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. దీపికా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్‌తో క‌లిసి ముంబైలో నివ‌సిస్తున్న విష‌యం తెలిసిందే.

Advertisement